UPDATES  

NEWS

 కొడాలి నాని రాజకీయ సన్యాసం…

2004లో మొదటిసారి కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.నందమూరి హరికృష్ణ సిఫారసులతో అప్పట్లో టిక్కెట్ దక్కించుకున్నారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి మేరకు మరోసారి చంద్రబాబు టిక్కెట్ కేటాయించారు. అయితే టిడిపి నాయకత్వాన్ని విభేదించి వైసిపిలో చేరారు. 2014,2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానిని జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి నుంచి తొలగించారు. అయినా సరే జగన్ పట్ల వీర విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికలే తనకు చివరివని ప్రకటించి నాని సంచలనానికి తెర తీశారు.

 

గుడివాడలో ఎలాగైనా పట్టు బిగించాలని టిడిపి భావిస్తోంది. బలమైన నేతగా ఉన్న ఎన్నారై వెనిగండ్ల రామును బరిలో దించింది. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం. మరోవైపు కాపులు సైతం గణనీయంగా ఉన్నారు. అయితే కమ్మ సామాజిక వర్గం కొడాలి నాని పై ఆగ్రహంగా ఉంది. జగన్ ప్రాపకం కోసం చంద్రబాబు, లోకేష్ లపై నాని విరుచుకుపడుతుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈసారి నానికి వ్యతిరేకంగా మారుతున్నారు. అయితే తనకున్న మాస్ ఫాలోయింగ్ తో ఎన్నికల్లో అధిగమించగలనని నాని ధీమాతో ఉన్నారు.అయితే ఇంతవరకు వైసీపీ హై కమాండ్ టిక్కెట్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు.అందుకే నాని ఈ తరహా ప్రకటన చేశారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

 

2024 ఎన్నికల్లో కొడాలి నాని కి గుడివాడ నుంచి గట్టి పోటీనే ఉంది.అసలు ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన పోటీ చేస్తారో లేదో ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇటీవల సడన్ గా మండల హనుమంతరావు పేరు వినిపించింది. అభివృద్ధి లేకపోవడంతో కొడాలి నాని పై గుడివాడలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అందుకే ఈసారి ఆయన మార్చే ఉద్దేశం వైసీపీ హై కమాండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిశగా సంకేతాలు రావడంతో కొడాలి నాని వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని పెద్దగా అభివృద్ధి చేయలేదని ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఈసారి కొత్త అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ సైతం కొత్త ఆలోచన చేస్తోంది. కొడాలి నానిని సైడ్ చేసే పనిలో పడినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే నాని సింపతి కోసం చేశారో.. వైసిపి హై కమాండ్ కు దారికి తెచ్చుకోవాలని భావించారో తెలియాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |