లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకు గానూ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్ డే వెల్లడించారు. వారణాసి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులకు చోటు దక్కింది. తెలంగాణ లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై సుదీర్ఘ చర్చలు జరిపిని విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే మొదటి జాబితా వెల్లడైంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై సుదీర్ఘ చర్చలు జరిపిని విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే మొదటి జాబితా వెల్లడైంది.
రాష్ట్రాల వారిగా చూస్తే పశ్చిమ బెంగాల్ నుండి 27 మంది అభ్యర్థులు, మధ్యప్రదేశ్ నుంచి 24, గుజరాత్ నుంచి 15, రాజస్థాన్ 15, కేరళ12,తెలంగాణ 9, ఝార్ఖండ్ 11, ఛతీస్ గడ్ 12, డిల్లీ 5, జమ్మూకశ్మీర్ 2, ఉత్తరాఖండ్ 3, అరుణాచల్ ప్రదేశ్ 2, గోవా 1, త్రిపుర 1, అండమాన్ నికోబార్ 1, దమన్ అండ్ దీవ్ 1 అభ్యర్థులను బరిలో దింపనుంది.
తెలంగాణలో కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్,మల్కాజ్ గిరి నుంచి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవీ లత, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి పి.భారత్, భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్ లు పేర్లను ప్రకటించారు.
.