UPDATES  

NEWS

 VD14 లో సౌత్ ఆఫ్రికన్ యాక్టర్..!

కొన్నిసార్లు విపరీతమైన పేరు వచ్చిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ సినిమా చేయడానికి కొంతమంది నటులు చాలా కష్టపడుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేరు. సక్సెస్ కోసం ఎంతలా కష్టపడతారో, ఆ సక్సెస్ నిలబెట్టుకోవడానికి అంతకు మించి కష్టపడాలి. అలా కష్టపడినప్పుడే ఆ నటులకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఆ క్రేజ్ ఉంటుంది.

 

ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కనిపించిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అయిపోయారు. ఒక చిన్న సినిమాను కూడా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ఆ సినిమా మంచి ఎగ్జాంపుల్.

 

విజయ్ దేవరకొండ సినిమాలో సౌత్ ఆఫ్రికన్ యాక్టర్

విజయ్ దేవరకొండ రాహుల్ దర్శకత్వంలో ప్రస్తుతం తన 14వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రాహుల్ దర్శకత్వంలో టాక్సీవాలా సినిమాను చేశాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. విజయ్ దేవరకొండ దక్షిణాఫ్రికా నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (ది మమ్మీ, ది మమ్మీ రిటర్న్స్) తో నటిస్తున్నారు, అతను ఈ సినిమాలో బ్రిటిష్ అధికారిగా నటించాడు. బ్రిటిష్ కాలంలో రాయలసీమ నేపథ్యంలో నడిచే ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది.

 

అర్జున్ రెడ్డి తో స్టార్ డం

పెళ్లి చూపులు సినిమాతో హీరో అయిపోయిన తర్వాత అర్జున్ రెడ్డి సినిమా విపరీతమైన స్టార్డం తీసుకొచ్చింది. ఆ సినిమా ఎంత స్టార్డం తీసుకొచ్చింది అంటే ఇప్పటికీ విజయ్ సినిమాలు ఫెయిల్ అవుతున్న కూడా ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఆయన కోసం నిల్చుని ఉంది అంటే కారణం అర్జున్ రెడ్డి. అర్జున్ అనే పాత్రలో విజయ్ ఒదిగిపోయిన విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇప్పటికీ అర్జున్ రెడ్డి అనే పాత్రలో విజయ్ తప్ప ఇంకెవరిని ఊహించలేము అనే రేంజ్ లో చేశాడు. ఇక ప్రస్తుతం రాహుల్ దర్శకత్వం తో పాటు రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా మరో సినిమా కూడా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |