UPDATES  

NEWS

 అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భాంతి..

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం, రెడ్డివారిపల్లె చెరువు వద్ద మామిడికాయల లోడు లారీ బోల్తాపడిన దుర్ఘటనలో తొమ్మిది మంది కూలీలు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

ఈ ప్రమాదంలో కూలీలు మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఆ పేద కుటుంబాలకు అండగా నిలవాలని జగన్ ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |