UPDATES  

NEWS

 అనంతపురం జిల్లా లో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అనంతపురం, సింగనమల, గుంతకల్ MLA లు రాష్ట్రం లో 53 మంది కూటమి MLA లకు వ్యతిరేక గాలులు..

ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గంలో పరిస్ధితులు ఎలా ఉన్నాయి, ఎమ్మల్యేలు, ఎంపీలపై ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్రవ్యాప్తంగా అధికార కూటమిపై ప్రజా అభిప్రాయం ఎలా ఉందన్న దానిపై రైజ్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి.ఈ మేరకు 175 అసెంబ్లీ సీట్లతో పాటు 25 పార్లమెంట్ సీట్లలోనూ తాజా పరిస్ధితుల్ని వివరిస్తూ సర్వేయర్ ప్రవీణ్ పుల్లట తమ సర్వే ఫలితాలు ప్రకటించారు.

 

రైజ్ సర్వేలో ప్రభుత్వ పనితీరుపై ప్రజా స్పందన చూస్తే.. కూటమి పనితీరు బాగుందని 52.8 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. బాగా లేదని 26 శాతం, పర్వాలేదని 21.2 శాతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఏ ప్రభుత్వ పనితీరు బాగుందని అడిగితే కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని 51 శాతం, వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 38 శాతం అభిప్రాయపడ్డారు. మరో 11 శాతం చెప్పలేమన్నారు. ఎక్కువ సంక్షేమం అందించిన సీఎం జగన్ అని 52 శాతం, చంద్రబాబని 48 శాతం చెప్పారు.

 

కూటమి ఎమ్మెల్యేల పనితీరు గురించి అడిగితే బాగుందని కేవలం 28 శాతం మందే చెప్పారు. బాగోలేదని ఏకంగా 64 శాతం మంది చెప్పారు. మరో 8 శాతం చెప్పలేమన్నారు. ఏ సీఎం హయాంలో అభివృద్ధి ఎక్కువగా జరిగిందని అడిగితే చంద్రబాబు అని 59 శాతం, జగన్ అని మరో 41 శాతం మంది చెప్పారు. అమరావతిపై అభిప్రాయం అడిగితే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని 78 శాతం మంది, రాజధాని అభివృద్ధి చెందాలని మరో 22 శాతం మంది చెప్పారు.

 

రాష్ట్రంలో మంత్రుల పనితీరు అడిగితే ఆరుగురు మంత్రులు (చంద్రబాబు, పవన్, లోకేష్, నారాయణ, రామానాయుడు,పయ్యావుల కేశవ్) పనితీరు బాగుందని, మరో 9 మంది మంత్రులు (కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి) పనితీరు పర్వాలేదని చెప్పారు. ఇక 10 మంది మంత్రులు (కొల్లు రవీంద్ర, సత్యకుమార్, పార్ధసారధి, బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్ధన్ రెడ్డి, సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్) పనితీరు బాగోలేదని చెప్పారు.

 

అలాగే ప్రభుత్వంపై అసంతృప్తికి ప్రధానంగా 9 కారణాలు చెప్పారు. ఇందులో అమరావతి రెండో విడత భూసేకరణ, కక్ష సాధింపులో వైసీపీతో పోటీ, ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల ఇబ్బందులు, రేషన్ సరఫరాలో మార్పు, ఎమ్మెల్యేల అవినీతి, విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, గ్రామాల్లో కొనుగోలు శక్తి క్షీణించడం, సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కర్ పర్సెంటేజ్ లని చెప్పారు. ప్రభుత్వ అనుకూల అంశాలుగా రోడ్ల మరమ్మత్తులు, కొత్త రోడ్ల నిర్మాణం, పెట్టుబడుల రాక, తల్లికి వందనం, రాజధాని అబివృద్ధి, ఉచిత గ్యాస్ సిలెండర్లు, విద్య పథకాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టడం, ధాన్యం, పొగాకు కొనుగోళ్లు, పంచాయతీల అభివృద్ధి వంటి వాటిని చెప్పారు.

 

ఎంపీల పనితీరు చూస్తే గ్రీన్ జోన్ లో తొలి స్ధానంలో పెమ్మసాని చంద్రశేఖర్, రెండో స్ధానంలో రామ్మోహన్ నాయుడు, మూడో స్ధానంలో బైరెడ్డి శబరి, నాలుగో స్ధానంలో కేశినేని చిన్ని, ఐదో స్ధానంలో లావు కృష్ణదేవరాయాలు, ఆరో స్ధానంలో పుట్టా మహేష్, ఏడో స్ధానంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి ఉన్నారు. ఇక ఆరెంజ్ జోన్ లో బాలశౌరి, శ్రీ భరత్, పురందేశ్వరి, అప్పలనాయుడు, ఉదయ్ శ్రీనివాస్, దగ్గుమళ్ల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేశ్, శ్రీనివాస్ వర్మ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, హరీష్ మాధుర్ ఉన్నారు. ఇక రెడ్ జోన్ లో మాగుంట శ్రీనివాసులురెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్, అంబికా లక్ష్మీనారాయణ, అవినాష్ రెడ్డి, తనూజా రాణి, బస్తిపాటి నాగరాజు ఉన్నారు.

 

 

 

ఎమ్మెల్యేల విషయానికొస్తే గ్రీన్ జోన్ లో 32 మంది ఉన్నారు. వీరిలో ఇచ్చాపురం, టెక్కలి, బొబ్బిలి, అనకాపల్లి, భీమిలి, గాజువాక, నర్సీపట్నం, పాయకరావుపేట, విశాఖ తూర్పు, అమలాపురం, మండపేట, పిఠాపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, గోపాలపురం, పాలకొల్లు, ఉండి, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మంగళగిరి, పొన్నూరు, కొండెపి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, చంద్రగిరి, పలమనేరు, కుప్పం, పుంగనూరు, పులివెందుల, హిందూపూర్, ఉరవకొండ, బనగానపల్లె ఎమ్మెల్యేలు ఉన్నారు.

 

 

 

అలాగే ఆరెంజ్ జోన్ లో ఉన్న 90 మందిలో ఆముదాల వలస, ఎచ్చెర్ల, పలాస,గజపతినగరం, నెల్లిమర్ల, సాలూరు, కురుపాం, విజయనగరం, రాజాం, ఎస్ కోట, చోడవరం, పెందుర్తి, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, ప్రత్తిపాడు, అనపర్తి, జగ్గంపేట, కొత్తపేట, ముమ్మడివరం, పెద్దాపురం, రంపచోడవరం,తుని, ఆచంట, దెందులూరు, కైకలూరు, నరసాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, గన్నవరం, జగ్గయ్యపేట, మచిలీపట్నం, మైలవరం, నందిగామ, నూజివీడు, పామర్రు, పెడన, పెనమలూరు, విజయవాడ వెస్ట్, బాపట్ల, చిలకలూరిపేట, గురజాల, వినుకొండ, మాచర్ల, రేపల్లె, తాడికొండ, తెనాలి…

 

వేమూరు, దర్శి, అద్దంకి, పర్చూరు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, ఒంగోలు, ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి, చిత్తూరు, మదనపల్లె, నగరి, పీలేరు, తంబళ్లపల్లె, జమ్మలమడుగు, కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, తాడిపత్రి, డోన్, కర్నూలు, మంత్రాలయం, నందికొట్కూరు, నంద్యాల, పత్తికొండ, శ్రీశైలం, ఎమ్మిగనూరు ఉన్నాయి.

 

అలాగే రెడ్ జోన్ లో 53 నియోజకవర్గాల్లో నరసన్నపేట, పాతపట్నం, శ్రీకాకుళం, చీపురుపల్లి, పార్వతీపురం, పాలకొండ, అరకు, మాడుగుల, పాడేరు, విశాఖ సౌత్, యలమంచిలి, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పి.గన్నవరం, రాజానగరం, రామచంద్రపురం, రాజోలు, భీమవరం, చింతలపూడి, కొవ్వూరు, పోలవరం, ఉంగుటూరు, అవనిగడ్డ, గుడివాడ, తిరువూరు, గంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, పెదకూరపాడు, చీరాల, సంతనూతలపాడు, గూడూరు, కావలి, ఉదయగిరి, సూళ్లూరుపేట, జీడీ నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, బద్వేలు, రైల్వే కోడూరు, అనంతపురం అర్బన్, శింగనమల, గుంతకల్, ఆదోని, ఆళ్లగడ్డ, ఆలూరు, కోడుమూరు, పాణ్యం ఉన్నాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |