UPDATES  

NEWS

 మహేష్ మూవీ పై రాజమౌళి బిగ్ అప్డేట్..? నిజమేనా ..?

మహేష్ బాబు (Maheshbabu ) తొలిసారి రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో పాన్ ఇండియా మూపాప్9 వీ కాకుండా ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. SSMB 29 (SSMB 29) అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచే రోజుకొక వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కీ రోల్ పోషిస్తూ ఉండగా.. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఇందులో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతోంది అని అందరూ ప్రచారాలు జోరుగా చేపట్టిన వేళ.. తాజాగా ఈ సినిమాపై రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్లు మరో వార్త తెరపైకి వచ్చింది.

 

మహేష్ మూవీ పై రాజమౌళి కీలక నిర్ణయం..

 

ప్రస్తుతం రాజమౌళి – మహేష్ బాబు మూవీకి సంబంధించిన షూటింగ్ పనులు వేగంగా మొదలయ్యాయి. అయితే ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్, మహేష్ బాబు, ప్రియాంక చోప్రాల మీద సీన్లను కూడా తెరకెక్కించినట్లు సమాచారం. కానీ ఇంతవరకు ఏ విషయాన్ని కూడా రాజమౌళి ప్రకటించలేదు. అటు పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను కూడా బయట పెట్టలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. బాహుబలి 1, 2 సినిమాలు ఏ రేంజ్ లో ట్రెండ్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు కూడా పార్ట్ 1 , పార్ట్ 2 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాని కూడా జక్కన్న రెండు పార్టులుగా తీస్తాడని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ రాజమౌళి ఇప్పుడు ఈ చైన్ ను బ్రేక్ చేయాలని అనుకుంటున్నాడో ఏమో కానీ ఎస్ ఎస్ ఎం బి 29 ఒక పార్ట్ గానే ఉంటుందని అందరూ అంటున్నారు. అంతేకాదు ఈ మేరకు అనౌన్స్మెంట్ వీడియోని కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

 

అభిమానుల కోసం త్వరలో బిగ్ అప్డేట్..

 

దీనికి తోడు ఇప్పటివరకు వచ్చిన ఫుటేజ్ లో నుంచి అదిరిపోయే వీడియోని రెడీ చేసి.. అభిమానుల కోసం రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టెక్నీషియన్లను ఈ సినిమా కోసం రాజమౌళి రంగంలోకి దింపారు. అటు కీరవాణి (Keeravani) కూడా అంతర్జాతీయ స్థాయిలో సంగీతాన్ని అందించబోతున్నారు. ఇక మరొకవైపు విజయేంద్రప్రసాద్ కూడా స్క్రిప్ట్ పూర్తి చేసి ప్రస్తుతం రిలాక్స్డ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి జక్కన్న ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడు.. గతంలో లాగా ప్రెస్ మీట్ పెట్టి సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయాలను అభిమానులతో పంచుకుంటారా అనే విషయంపై అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి రాజమౌళి , మహేష్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |