పాలనలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విషయంలో స్లాట్ బుకింగ్ పద్దతికి తొలి అడుగు పడింది. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని శుక్రవారం సచివాలయం నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. తొలి విడతలో 26 జిల్లాల్లో ప్రధాన కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెల చివరినాటికి దశల వారీగా మొదలుకానున్నాయి. కొత్త సంస్కరణల వల్ల అవినీతికి ఏ మాత్రం తావు ఉండదని అన్నారు.
దీనికితోడు ప్రజలకు సులభమైన విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. భూ వివాదాలు లేకుండా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై రోజుల తరబడి వేచి చూసే అవకాశం ఉండదన్నారు. సమయం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని వెల్లడించారు. మంచి ఫలితాలు వస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం నాలా చట్టాన్ని తొలగించి కొత్త విధానం తెచ్చినట్టు వివరించారు.
ఇళ్లు, భూములు రిజిస్ట్రేషన్ల విషయంలో ఇకపై రోజుల తరబడి చూసే అవకాశం లేదు. అమ్మకాలు.. కొనుగోలు చేసేవారు ఇబ్బందులకు ముగింపు పలికింది. రిజిస్ట్రేషన్లలో స్లాట్ బుకింగ్ కొత్త ప్రక్రియను అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి మరింత సులభంగా ఉండనుంది.
ALSO READ: చిక్కుల్లో కేతిరెడ్డి
ప్రభుత్వ సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. దీనికి ముందు రోజు సాయంత్రం ఐదులోపు స్లాట్ బుక్ తప్పక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం తొలుత జిల్లా ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండనుంది. అధికంగా డిమాండ్ ఉండే మండల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు విస్తరిస్తారు.సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్ కోసం ఫీజు స్లాట్ బుకింగ్ ఫీజు కాసింత ఎక్కువగా ఉండనుంది.
అపాయింట్‌మెంట్‌కు కనీసం ఒక రోజు ముందు అవసరమైన రుసుమును తప్పక చెల్లించాలి. ఆన్‌లైన్ సర్వీస్‌లో డాక్యుమెంట్ ఎంట్రీ అండ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ తొలుత క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేరును నమోదు చేయాలి. దీని తర్వాత ఓటీపీ కోసం ఈ-మెయిల్, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ వాటిల్లో ఏదో ఒకటి ఇవ్వాలి. ఆ తర్వాత ఓటీపీ బటన్ క్లిక్ చేయాలి.
దాని తర్వాత ఇచ్చిన ఈ-మెయిల్, ఫోన్ నెంబర్‌కి మేసెజ్ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపుగా ముగియవచ్చు. ఆ తర్వాత మళ్లీ లాగిన్ కావాలి. ఈ-మెయిల్, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఏదో ఒకటి ఇవ్వాలి. వెంటనే ఓటీపీ వస్తుంది..దాన్ని ఎంటర్ చేస్తే లాగిన్ అవుతుంది. పబ్లిక్ డేటా ఎంట్రీ ఆప్షన్‌న్‌ను క్లిక్ చేయాలి. అందులో బుక్ స్లాట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
అక్కడ అడిగిన వివరాలతోపాటు సమయం నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వివరాలను సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఐడీ జనరేట్ అవుతుంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి పని వస్తుంది. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఎంచుకోవాల్సి ఉంటుంది. ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్‌తో ప్రత్యేకమైన డిజిటల్ టోకెన్ కేటాయిస్తారు. ప్రతి టోకెన్ కి ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌తో లింక్ చేసి ఉంటుంది. ఇది సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కేటాయిస్తారు.