UPDATES  

NEWS

 ‘పెద్ది’ మూవీలో ఆ పాత్రలో రామ్ చరణ్..! ఇక ఫ్యాన్స్ కు పునకాలే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఈ ఏడాది భారీ అంచనాల నడుమ గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా స్టోరీ బాగున్న కూడా అక్కడక్కడా కొన్ని మైనస్ లో ఉండడంతో సినిమా యావరేజ్ టాక్ ని అందుకుంది. ఆడియన్స్ ని పెద్దగా మెప్పించలేకపోయింది ఈ సినిమా. ప్రస్తుతం ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.. రీసెంట్గా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ను ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఆ పోస్టర్లో రామ్ చరణ్ ఊరమాస్ లుక్ లో కనిపిస్తాడు. చూస్తుంటే ఈ సినిమాతో రంగస్థలం నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. మొన్న రిలీజ్ అయిన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఇదే అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతుంది.

 

“పెద్ది ” పై పెరుగుతున్న అంచనాలు..

 

బుచ్చి బాబు ఈ మూవీ పై అంచనాలు పెరిగేలా చేస్తున్నాడు. నిన్న ఉగాది సందర్బంగా టీజర్ రికిజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఫైనల్ మిక్సింగ్, రీ రికార్డింగ్ లో జరిగిన ఆలస్యం వల్ల ఉగాది రోజు దాన్ని విడుదల చేసే అవకాశముంది. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే టైటిల్ తో మెగా ఫ్యాన్స్ లో పునకాలు తెప్పించాడు. స్టోరీ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టే పెద్ది టైటిల్ అధికారికంగా లాకైపోయింది. నిఖార్సైన మాస్ లుక్ తో చేతిలో చుట్ట కాలుస్తూ రౌద్రం నిండిన కళ్ళతో రామ్ చరణ్ గెటప్ చూస్తుంటే రంగస్థలం మించి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

స్టోరీ లైన్..

 

గతంలో చరణ్ మాస్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ఉన్నాడు. రంగస్థలం మించి ఇందులో కనిపిస్తాడని తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ లో ఐఎఎస్ ఆఫీసర్ గా మరీ ఓవర్ సాఫ్ట్ అయిపోవడం వాళ్లకు కనెక్ట్ కాలేదు. అందులోనూ బ్యాడ్ కంటెంట్ మరింత దెబ్బ కొట్టింది. కానీ పెద్ది విషయంలో అలాంటి అనుమానాలు అక్కర్లేదు. గురువును మించి ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఇంకా ఫిక్స్ చెయ్యలేదు కానీ వచ్చే ఏడాది పక్కా ఏడాది పక్కా థియేటర్లలోకి వస్తుందని తెలుస్తుంది.2026 మార్చి 26 ఖరారయ్యిందనే లీక్ ఎంతవరకు నిజమనేది తెలిసేది అప్పుడే. నాని ది ప్యారడైజ్ ఉన్నప్పటికీ ఇది మంచి డేట్ అనే ఉద్దేశంతో మైత్రి మేకర్స్ దీని వైపే మొగ్గు చూపినట్టు టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న పెద్దిలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక రోల్ చేస్తున్నాడు. జగపతి బాబు, దివ్యేన్దు లాంటి ఆర్టిస్టులు, ఏఆర్ రెహమాన్ సంగీతం అంచనాలు పెరిగేలా చేస్తున్నాయి. మొత్తానికి పెద్ది కి రెస్పాన్స్ బాగానే వస్తుంది. మూవీ ఎలా ఉంటుందో వచ్చే ఏడాది వరకు వెయిట్ చెయ్యాల్సిందే..

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |