UPDATES  

NEWS

 గవర్నర్‎తో సీఎం రేవంత్ భేటీ.. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం..!..

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తైనట్టు సమాచారం. ఉగాది పర్వదినం రోజున సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. గంటపాటు జరిగిన ఈ భేటీలో కీలకఅంశాలు చర్చించినట్టు తెలుస్తోంది. అందులో మంత్రి వర్గ విస్తరణ అంశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

 

మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత

 

కొత్తగా నలుగురు లేదా ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మంత్రులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్‌ విప్‌ పదవుల భర్తీకి సైతం కసరత్తు చేస్తున్నారు. ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి నేతలకు కేబినెట్‌లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఇక గతంలో హామీ ఇచ్చిన మరో ఇద్దరికి సైతం బెర్త్‌ దక్కే అవకాశం ఉంది. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ నేతను ఎంపిక చేసినట్లు సమాచారం. బీసీ ముదిరాజ్‌ కోటాలో వాకాటి శ్రీహరి పేరు విన్పిస్తోంది. ఇక ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డి, ఎస్సీ కోటాలో వివేక్‌, హామీలో భాగంగా రాజగోపాల్‌రెడ్డికి కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం కన్పిస్తోంది.

 

ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణకు ఛాన్స్?

 

తెలంగాణ కాంగ్రెస్ లో క్యాబినేట్ విస్తరణ హడావిడి మొదలైంది. ఉగాది లేదా ఏప్రిల్ మూడవ తేదీన కేబినెట్ విస్తరణ ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది కేబినేట్ విస్తరణలో బెర్త్ కోసం.. ఎందరో ఆశావహులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందులోనూ సామాజిక వర్గాల వారీగా ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారట. ఈ విస్తరణలో ఆరు ఖాళీలు మాత్రమే ఉండటంతో.. డిమాండ్ భారీగా ఉందట.

 

మాదిగ సామాజిక వర్గం నుంచి 6 మంది MLAలు హైకమాండ్ కి లెటర్లు

 

వివిధ సామాజిక వర్గాల వారి నుంచి సముచిత ప్రాతినిథ్యం కోసం ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోందట. మరీ ముఖ్యగా మాదిగ, లంబాడ, మున్నూరు కాపు, యాదవ వంటి సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం గట్టిగానే పోరాడుతున్నారట. తెలంగాణ కేబినేట్ విస్తరణలో చోటు దక్కించుకోవడం కోసం ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు తమకు ప్రాతినిథ్యం కల్పించాలని తీవ్ర యత్నాలు సాగిస్తున్నారట. ఇప్పటికే అధిష్టానం పెద్దలకు రాష్ట్రంలోని ముఖ్య నాయకులు లేఖలు రాస్తున్నారట. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్ హై కమాండ్ కి లేఖలు రాశాట. తమ వర్గానికి కేబేట్ లో చోటు కల్పించాలని కోరారట.

 

నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ SC ఎంపీ స్థానాలకు మాదిగలకు..

 

2024 లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ వంటి ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మాదిగ వర్గానికి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు కాబట్టి.. కేబినేట్ విస్తరణలో మరో ఛాన్స్ ఇవ్వమండీ అంటూ వీరు తీవ్ర యత్నం సాగిస్తున్నారట.

 

రాష్ట్ర జనాభాలో సుమారు 45 లక్షల మంది మాదిగలు

 

ఈ కేబినేట్ విస్తరణలో వివేక్ పేరు ప్రముఖంగా వినిపించడంతో.. మాదిక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మాల సామాజికవర్గానికి చెందిన వివేక్ కు మంత్రి పదవినిస్తే తమకు అన్యాయం జరుగుతుందంటూ.. మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదన చెందుతున్నారట. మరో వైపు.. రాష్ట్ర జనాభాలో సుమారు 45 లక్షల పైచిలుకు మాదిగలున్నారు. అందుకే తమకు మరో ఛాన్స్ కల్పించాలని వీరు కోరుతున్నారట. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహ ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఆ వర్గానికి చెందిన మరొకరికి అవకాశమిస్తే.. ఈవర్గానికి పార్టీ నుంచి సరైన సంకేతాలను పంపినట్టు అవుతుందని వీరు అంటున్నారట.

 

మరొక్కరికి ఛాన్స్ ఇస్తే ఈ వర్గంలోకి సరైన సంకేతాలిచ్చినట్టు అవుతుంది-MLAలు

 

ప్రస్తుతం కేబినేట్‌లో ఆరుగురికి మాత్రమే ఛాన్స్ ఉండటంతో.. లాంబాడా నుంచి మరొకరికి అవకాశమివ్వాలని కోరుతున్నారట.. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందట. ఇక సెకండ్ ప్లేస్ లో డోర్నకల్ ఎమ్మెల్యే రాం చంద్రు నాయక్ పేరు వినిపిస్తోందట.

 

ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ఉన్న రాం చంద్రు నాయక్

 

ప్రస్తుతం రాంచంద్రు నాయక్ ప్రభుత్వ విప్ గా ఉన్నారు. అంతేగానీ కేబినేట్ లో లంబాడా సామాజిక వర్గం నుంచి ఎవరూ లేరు. దీంతో ఎస్టీల్లోని లంబాడా వర్గానికి చెందిన నేతకు తప్పక అవకాశమివ్వాలని కోరుతున్నారట ఈ వర్గం నేతలు. ఐతే బాలూ నాయక్ కి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే లంబాడాలకు కేబినెట్ లో చోటు దక్కేనా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

 

ఇదే జరిగితే లంబాడాలకు కేబినేట్ లో చోటు దక్కేనా?

 

ఏది ఏమైనా లాంబాడాలకు కేబినేట్ లో చోటు కల్పించాల్సిందే అంటూ.. ఈ వర్గం నేతలు.. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుని మరీ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా ఢిల్లీకి సైతం లేఖలు రాస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు చేస్తున్న ఈ తీవ్ర యత్నాలు ఫలించేనా? మాదిగ సామాజిక వర్గానికి మరో పదవి దక్కేనా? లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టేనా? ఏం జరగనుంది? అన్న ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.

 

మాదిగలకు మరో పదవి, లంబాడాలకు చోటు.. దక్కేనా?

 

మొత్తంగా తెలంగాణ కేబినెట్ విస్తరణలో సామాజిక వర్గ న్యాయం పాటించేలా తెలుస్తోంది. ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా.. పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగేలా కనిపిస్తోందంటున్నారు. మరి ఈ పరిస్థితుల నడుమ ఈ సామాజిక వర్గాల యత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో తెలియాలి. ఏప్రిల్ మొదటి వారం వరకూ వేచి చూడాల్సిందేనంటున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |