UPDATES  

NEWS

 ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం..

బెట్టింగ్ యాప్ లు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. వీటి బారిన పడిన ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ యాప్ లను సినీ నటులు, యూట్యూబర్లు, క్రీడాకారులు ప్రమోట్ చేస్తుండటంతో… ఎంతోమంది వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒక్కసారి బెట్టింగ్ వలలో పడ్డారంటే… ఇక బయట పడటం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం కలకలం రేపుతోంది. ఈ యాప్ లను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు కేసులు ఎదుర్కొంటున్నారు.

 

తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపుదామని ఆయన అన్నారు. బెట్టింగ్ లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొద్దామని తెలిపారు. మనం తీసుకునే నిర్ణయాలు ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను పూర్తిగా అరికట్టేలా ఉండాలని చెప్పారు.

 

రాష్ట్రంలో నేరాలు తగ్గినప్పటికీ… ఆర్థిక నేరాలు పెరిగాయని చంద్రబాబు చెప్పారు. గంజాయి సాగు కూడా తగ్గిందని తెలిపారు. నేరస్తులు చాలా తెలివిగా ఉంటారని… సాక్ష్యాలు దొరకకుండా మాయం చేస్తారని చెప్పారు. నేరస్తుల్లో కొందరు పారిపోతారని…. మరికొందరు నేరాన్ని పక్క వ్యక్తులపై తోసేస్తారని… వైఎస్ వివేకా హత్య కేసు దీనికి ఉదాహరణ అని అన్నారు. నేరాలను తగ్గించేందుకు పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మావోయిస్టుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కూడా తీసుకోవాలని చెప్పారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |