యంగ్ రెబల్ స్టార్ సినిమాల లైనప్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమాలలో స్పిరిట్ ఒకటి. సెన్సేషన్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది స్పిరిట్. అందులోను ఫస్ట్ టైం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు చూడని విధంగా ప్రభాస్‌ని సరికొత్త కోణంలో చూపించబోతున్నాడట సందీప్ రెడ్డి. అందుకే సందీప్ అడిగినన్ని రోజులు డేట్స్ ఇచ్చేసాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు సందీప్.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఎక్సక్లూసివ్ న్యూస్ ఒకటి తెలిసింది. ఈ సినిమాలో రెబల్ స్టార్ తో పాటు మరోక స్టార్ హీరో కూడా నటిస్తున్నాడు. గతేడాది మహారాజతో సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పిరిట్ లో నటిస్తున్నాడు. ఇటీవల విజయ్ సేతుపతిని కలిసి కథ వినిపించగా అందుకు సేతుపతి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు. అలాగే విజయ సేతుపతి ఎదో గెస్ట్ రోల్ లేదా విలన్ రోల్ కాదని రెబల్ స్టార్ కు ధీటుగా పవర్ఫుల్ పోలీస్ పాత్ర అని సమాచారం. సినిమాను మొత్తం 120 రోజుల వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ పోలీస్ అంటేనే అంచనాలు ఓ రేంజ్ కు చేరుకున్నాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి వచ్చి చేరడంతో ఎక్స్ పెక్టషన్స్ పీక్స్ కు చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్ చివరి దశకు చేరుకుంది. ఏప్రిల్ లో స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి ఎక్కించేలా ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ.