UPDATES  

NEWS

 ఉప ఎన్నికలు ఖాయం.. సిద్ధంగా ఉండండి: కేటీఆర్..

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నెల 10వ తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈమేరకు ప్రశ్నించింది. స్పీకర్ సమయం నిర్దేశించకుంటే… తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

 

ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని చెప్పారు. ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ కేడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |