సంక్రాంతి సందడి మొదలైంది. కోడి పందేల బరులు సిద్ధమయ్యాయి. గతం కంటే భిన్నంగా భారీ ఏర్పాట్లతో కోళ్ల సమరం కోసం సై అంటున్నారు. ఇందు కోసం వందల ఎకరాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ తెరలు.. ఫ్లడ్ లైట్లు సిద్దం ఏర్పాటు చేసారు. పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవ ని పోలీసుల హెచ్చరికలు ఉన్నా… పెద్ద సంఖ్యలో పందేలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రముఖుల సైతం తరలి వస్తున్నారు. సంక్రాంతి వేళ గోదావరి పల్లెల్లో భారీ సందడి కనిపిస్తోంది. ఇక, మూడు రోజుల పాటు పండుగ జోష్ కనిపించనుంది.
సంక్రాంతి వేళ కోడిపందేల కోసం బరులు సిద్ధమయ్యాయి. ముందుగానే కోడి పందేల కోసం ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసారు. పందేలకు దించే కోళ్ల కోసం మంచి ఆహారం తో పాటుగా ధీటైన పోటీ ఇచ్చేలా తయారు చేసారు. ఇక, బరులను సైతం భారీ ఏర్పాట్లతో సిద్ధమయ్యాయి. గోదావరి జిల్లాల్లో బరుల్లో పెద్ద ఎత్తున స్క్రీన్లు… వీక్షించేందుకు ఏర్పాట్లు.. ఎల్ఈడీ లైట్లతో పాటుగా మంచి వంటకాలతో సై అంటున్నారు. పెద్ద సంఖ్యలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మరీ కోళ్లను రెడీ చేసారు. అదే విధంగా పందేలను వీక్షించే వారి కోసం రెస్టు రూమ్స్ .. వారికి కావాల్సిన రుచిరకమైన ఆహారం సిద్దం చేస్తున్నారు.
వందల ఎకరాల్లో పందేలను చూసేందుకు వచ్చే వారి కోసం బరుల వద్ద పెద్దఎత్తున కుర్చీలు వేశారు. నిర్వహణ ప్రదేశంలో భారీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. గోదావరి జిల్లాలతో పాటుగా ఉమ్మడి క్రిష్ణా. .గుంటూరు జిల్లాల్లోనూ కోళ్ల పందేల బరులు ఏర్పాటయ్యాయి. పందేలు జరిగే ప్రాంతంలో కుర్చీలు, టెంట్లు, ఎయిర్ కూలర్లు పెట్టారు. కాగా, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోడి పందేల బరులను పోలీసులు ధ్వంసం చేశారు. పండుగ వేళ జూద క్రీడలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. కోడి పందేల బరులపై డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు అనేక చోట్ల బరులకు అనుమతి లేదంటూ తొలిగిస్తున్నారు.