UPDATES  

NEWS

 ప్రభాస్ కి గాయం.. అసలు ఏమైందంటే..?

రెబల్ స్టార్, గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ గాయపడినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్లో ప్రభాస్ చీలమండ దగ్గర గాయం అయినట్లు పేర్కొన్నారు. ఆ కారణంగా జపాన్ లో రిలీజ్ అయ్యే కల్కి 2989 ఏడీ సినిమా ప్రమోషన్స్ కి తాను అటెండ్ కాలేకపోతున్నానని ప్రభాస్ తెలిపారు. గాయం నుండి త్వరలోనే కోలుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొంటానని కూడా ఆయన తెలిపారు. ఇక ప్రభాస్ చీలమండ గాయం కారణంగా కల్కి 2898 AD జపాన్ ప్రీమియర్‌కి రావడం లేదని తెలియడంతో ఆయన జపాన్ అభిమానులు నిరాశకు గురయ్యారు. షూటింగ్ సమయంలో ప్రభాస్ చీలమండకు గాయం కావడంతో విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆయన జపాన్ పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రమోషన్ల కోసం ఆయన విదేశానికి వెళ్లడానికి సిద్ధం కావడం ఇదే తొలిసారి.

 

ఇక ప్రభాస్ గాయం విషయాన్ని జాపనీస్ భాషలో రాసి ఉండగా దాన్ని కల్కి 2989 ఏడీ సినిమా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. “జపాన్‌లోని నా ప్రియమైన అభిమానులకు, నా గాయం కారణంగా ప్రీమియర్‌కి మీతో చేరలేనందుకు క్షమించండి. మీరు సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను మరియు త్వరలో మిమ్మల్ని కలవాలని ఎదురుచూస్తున్నాను అంటూ ప్రభాస్ రాసుకొచ్చారు. జనవరి 3, 2025న జపనీస్ న్యూ ఇయర్ షోగట్సు సందర్భంగా జపాన్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రం విడుదలకు సిద్ధమయింది. కాబట్టి డిసెంబర్ 18న జరగాల్సిన ఈ ఈవెంట్ చాలా కీలకమైనది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి 2898 AD భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రం, దీని బడ్జెట్ రూ. 600 కోట్లు. క్రీ.శ. 2898లో భవిష్యత్ నగరమైన కాశీలో జరిగిన కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరియు దీపికా పదుకొణె వంటి స్టార్-స్టడెడ్ యాక్టర్స్ తో ఈ సినిమాను మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూన్ 27న విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. ప్రపంచవ్యాప్తంగా 1,200 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |