UPDATES  

NEWS

 పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ..! త్వరలోనే సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్‌..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుపుతామన్నారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. మంత్రితో

వివిధ దేశాలకు చెందిన పునరుత్పాదక విద్యుత్ రంగ పారిశ్రామికవేత్తలు పలువురు శుక్రవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, ఇండస్ట్రియల్ పాలసీలపై చర్చించారు.

 

ఈ సందర్భంగా సియెల్ సోలార్ (SAEL SOLAR) కంపెనీ ప్రతినిధులు.. 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారు. దేశంలోని సుమారు 12 రాష్ట్రాల్లో.. పునరుత్పాదక విద్యుత్ ప్రాజక్ట్‌లను SAEL SOLAR కంపెనీ నిర్వహిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటికి వివరించారు. వారితో పాటు నార్వే, రష్యా, బ్రెజిల్, చైనా (బ్రిక్స్) దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తల బృందం కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ని కలిసి పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు తమ ఆసక్తిని తెలియజేశారు.

 

సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రికి చెప్పారు. అదే విధంగా చెత్త నుంచి విద్యుత్ (వేస్ట్ ఎనర్జీ) ఉత్పత్తి చేయడంతో పాటు సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో తమకు వున్న అనుభవాన్ని, పెట్టుబడులు పెట్టడానికి తమ సుముఖతను పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు.

 

ఏపీని పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తున్నామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. పారిశ్రామికవేత్తల భేటీలో చర్చించిన అంశాల గురించి మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని విమర్శించారు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు రక్షణ వుంటుందన్నారు. అనుమతుల మంజూరులో, ఇతర అన్ని అంశాలలో పారదర్శకత వుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

 

గత ప్రభుత్వ చర్యలతో ఐదేళ్లలో పారిశ్రామిక, విద్యుత్ రంగాలకు జరిగిన అపార నష్టాన్ని తెలియజేయడంతో పాటు.. నష్ట నివారణకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలను మంత్రి గొట్టిపాటి వివరించారు. పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ని నిలిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 

అదే విధంగా 600 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన దేశీ కంపెనీ SAEL SOLAR ప్రతినిధులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందించారు. పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడులకు ముందుకు వచ్చే దేశ, విదేశీ కంపెనీలకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |