తదుపరి మహారాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. దేవేంద్ర ఫడ్నవీస్ పేరును అధికారికంగా ప్రకటించారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే. బిజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం బీజేఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా అధికారికంగా ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. రేపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై ఆజాద్ మైదాన్‌లో సీఎం, కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇదిలా ఉంటే..మంత్రి పదవులు ఎవరెవరికి దక్కనున్నాయనేది మహా టాపిక్ గా మారింది. ఎన్నికల్లో గెలిచిన సీట్ల ప్రకారం.. ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను ఒక మంత్రి దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో అధిక సీట్లు రావడంతో పట్టుబట్టి సీఎం సీటు సంపాదించింది బీజేపీ.. ఇక పొత్తుల కారణంగా డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ఉంటారని సమాచారం. అయితే ఇప్పటికే బీజేపీ నిర్ణయంతో లోలోపన అసంతృప్తిగా ఉన్నారు ఏక్ నాథ్ షిండే. హోంశాఖ తో పాటు కీలక శాఖలో బీజేపీనే గ్రాబ్ చేసుకోవడంతో కేవలం డిప్యూటీ సీఎం పోస్టుతో ఆయన డిసపాయింట్ అయ్యారు. ఈ టైంలో షిండేను సంజాయించేందుకు ట్రై చేస్తోంది బీజేపీ హైకమాండ్.
ఇక రేపు ఆజాద్ మైదానంలో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండబోతోంది. ఈక్రమంలో మంత్రుల కేటాయింపుపై ఓ అంచనా వేసుకుంది మహాయుతి. ఇందులో భాగంగా 132 స్థానాలు గెలిచిన బీజేపీ నుంచి 20 నుంచి 22 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏక్ నాథ్ షిండే శివసేనకు 12, అజిత్ పవార్ ఎన్సీపీకి 9 నుంచి 10 పదవులు దక్కే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దీంతో శివసేన, ఎన్సీపీలకు ఏఏ శాఖలు ఇస్తారనేది ఇంట్రస్టింగ్ గా మారింది. ఇదైనా సాఫీగా సాగుతుందా.. లేక కూటమి పార్టీ నేతలు అడ్డు చెబుతారా అన్నది వేచి చూడాలి.