UPDATES  

NEWS

 ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమలులో కీలక మార్పు..!

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. ఇందు కోసం ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. లబ్ధిదారుల ఫోన్లకు శుభాకాంక్షల మెసేజ్‌లు అందుతున్నాయి. ఈ పథకం అమలు కోసం ఈ కేవైసీ తో పాటుగా బ్యాంకు ఖాతా అనుసంధానం తప్పని సరి చేసారు. దీంతో, వినియోగదారులు గ్యాస్ కంపెనీల ఈ కేవైసీ పూర్తి చేస్తున్నారు.

 

1 నుంచి అమలు

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్ల పథకం రేపు ప్రారంభం కానుంది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. దీపావళి పండుగను పురస్కరించుకుని గురువారం ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గ్యాస్‌ కంపెనీల అభ్యర్థనల మేరకు ఒక రోజు వాయిదా వేసి నవంబరు 1న ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామంలో సీఎం చంద్రబాబు చేతుల లబ్ధిదారులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేసి ఈ పథకం అమలుకు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

24 గంటల్లో జమ

ఇందు కోసం విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం యాక్టివ్‌ ఎల్పీజీ కనెక్షన్‌ కలిగి ఉండి, తెల్ల రేషన్‌కార్డు, ఆధార్‌కు లింక్‌ అయిన బ్యాంకు ఖాతా ఉన్నవారందరూ ఈ పథకానికి అర్హులేన ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఉచిత సిలిండర్లను కూడా లబ్ధిదారు లు ఎప్పటిలాగే ముందుగా గ్యాస్‌ ధరను చెల్లించి సిలిండర్లు బుక్‌ చేసుకోవాలి. ఆ వెంటనే లబ్ధిదారుల మొబైల్‌కు శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్‌ వస్తుంది. సిలిండర్‌ డెలివరీ అయిన 24 గంటల్లోపే గ్యాస్‌కు ముందుగా చెల్లించిన మొత్తం ఆయా గ్యాస్‌ కంపెనీల ద్వారా లబ్ధిదారుల ఆధార్‌కు లింక్‌ అయి ఉన్న బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.

 

సచివాలయాల్లో

ఈ తొలివిడత ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌లు వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతాయి. ఈలోపు ఎప్పుడైనా ఉచిత సిలిండర్లను పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్లు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించాలి. అందుకుగాను లబ్దిదారులు తమ గ్యాస్ ఏజెన్సీ దగ్గర గ్యాస్ కనెక్షన్ బుక్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు(బియ్యం కార్డు)తో ఈ-కేవైసీ చేయించుకోవాలి. ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న వారి డేటా 24 నుంచి 48 గంటలలో అప్డేట్ అవుతుంది. ఈ-కేవైసీ అప్డేట్ అయిన తర్వాత లబ్దిదారుడి మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. అనంతరం గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. అలాగే గ్రామాల వారీగా ఎన్పీసీఐ లింక్(బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్) చేసుకోవాల్సిన వారి వివరాలు సచివాలయాల్లో ఉందుబాటులో ఉంచారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |