కేంద్ర ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగుల కోసం కొత్త పథకం ప్రారంభించింది. పిఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PM Internship Scheme) పేరుతో ప్రతినెలా నిరుద్యోగులకు రూ.5000 ఆర్థిక సాయం అందించనుంది. కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వశాఖ ఈ పథకం కింద నిరుద్యోగులకు కంపెనీలలో ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగులకు ఇంటర్న్‌షిప్ అందిస్తోంది.
పిఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ అంటే ఏంటి?
దేశంలో నిరుద్యో సమస్యకు పరిష్కరించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పిఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ తీసుకువచ్చింది. 2024 లో కేంద్ర బడ్జెట్ లో ఈ పథకం గురించి ప్రభుత్వం ప్రకటించింది. ఇండియాలోని టాప్ 500 కంపెనీలలో దేశంలోని 500 మంది నిరుద్యోగ యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కోటి మంది నిరుద్యోగులకు పథకం కింద ఒకసారి రూ.6000, ఆ తరువాత ప్రతినెలా రూ.5000 ఇంటర్న్‌షిప్ ని ఆర్థిక సాయంగా అందజేస్తామని వెల్లడించారు. ఈ పథకం దశల వారీగా అమలు జరుగుతుంది. మొదటి దశ రెండు సంవత్సరాలు, రెండో దశ మూడు సంవత్సరాల వరకు ఉంటుంది.
పిఎం ఇంటర్న్‌షిప్ పథకం ప్రక్రియ, అర్హత
పిఎం ఇంటర్న్‌షిప్ పథకం ప్రకారం.. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు యువతకు ఇంటర్న్‌షిప్ లోని 10 శాతాన్ని చెల్లిస్తాయి. కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సియస్ఆర్)లో భాగంగా కంపెనీలో ఈ బాధ్యతను నిర్విర్తుస్తున్నాయి. ఈ పథకం ద్వారా ఇంటర్న్‌షిప్ పొందాలనుకునే నిరుద్యోగులు ఆన్‌లైన్ పోర్టల్ లో అప్లై చేసుకోవచ్చు. త్వరలోనే ఈ పోర్టల్ అందుబాటులోకి రానుంది.
ఈ ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా ఉద్యోగం పొందాలనుకునే వారి వయసు 21 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. చదువు పూర్తి చేసినవారికి మాత్రమే ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలి. అయితే ఐఐఎం, ఐఐటి, ఐఐఎస్ఈఆర్ లాంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన వారికి ఈ పథకం వర్తించదు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ (BA, B.Sc, B.Com, BCA, BBA, B.Pharma) పూర్తి చేసినవారు, ఐటిఐ, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినవారు ఈ పథకానికి అర్హులు.
విద్యార్థులకు క్లాస్ రూమ్ చదువులతో పాటు కంపెనీలలో ప్రాక్టికల్ ఉద్యోగ అనుభవం ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా లభిస్తుంది. ఈ పథకం కోసం అక్టోబర్ రెండో వారంలో ప్రభుత్వం అన్ లైన్ పోర్టల్ ప్రారంభించబోతోంది. ఈ పథకంల ప్రభుత్వంతో ఒప్పందం ఉన్న కంపెనీలు ఈ ఆన్‌లైన్ పోర్టల్ లో ప్రత్యేకంగా డాష్ బోర్డ్ కేటాయిస్తాయి. అందులో ఇంటర్న్‌షిప్ అవకాశాలు, కంపెనీ లొకేషన్, ఉద్యోగం కావాల్సిన విద్యార్హత, ఇంటర్న్‌షిప్ కు లభించే సదుపాయాలు.. ఇలా అన్ని వివరాలుంటాయి. పోర్టల్ అభ్యర్థుల తమ వివరాలు నమోదు చేస్తే.. అదే రెజ్యూమ్ కూడా తయారు చేస్తుంది.
ఇంటర్న్‌షిప్ కు అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు తమకు సూట్ అయ్యే ఏదైనా అయిదు కంపెనీలలో అప్లై చేసుకోవచ్చు. ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం దాదాపు రూ.800 కోట్లు ఖర్చు పెట్టబోతోంది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు ప్రభుత్వం అన్ని అప్లికేషన్లు పరిశీలించి తరువాత నవంబర్ 15 లోగా అభ్యర్థులకు వారి సెలెక్షన్ గురించి తెలియజేయబడుతోంది. డిసెంబర్ 2, 2024 నుంచి ఇంటర్న్‌షిప్ మొదలవుతుంది. మార్చి 2025 లోగా మొత్తం 1.25 లక్షల అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్ అందుతుంది.