హైడ్రా బుల్డోజర్లకు తాను అడ్డంగా ఉంటానని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా కూల్చివేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నేను ఉంటాను. హైదరాబాద్ నగరంలో హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. హైదరాబాద్ నగరంలో మా హయాంలో 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కట్టాం. హైడ్రా బాధితులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వండి. కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది. అసలు ఎన్ కన్వెన్షన్ కు పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్. జీహెచ్ఎంసీ, బుద్ధ భవన్ నాళాలపైనే ఉన్నాయి. మంత్రుల ఇండ్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోనే ఉన్నాయి. ముందు వాటిని కూల్చివేయండి. ఆ తరువాత పేదల ఇళ్లను కూల్చండి’ అంటూ కేటీఆర్ సీరియస్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. నగరంలో కూల్చివేతలతో హైడ్రా సంచలనం సృష్టిస్తోంది. హైడ్రాను ఏర్పాటు చేసినప్పటి నుంచి అక్రమ కట్టడాల కూల్చివేతల పరంపరా కొనసాగుతుంది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలను గుర్తించి, వాటిని కూల్చివేస్తున్నది హైడ్రా.