UPDATES  

NEWS

 మహాలక్ష్మిని 59 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టింది ఎవరు..?

కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నేపాల్ కు చెందిన మహాలక్ష్మి హత్య కేసులో బెంగళూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం నిర్వహించి తుది నివేదిక అందే సమయానికి పోలీసులు కేసుకు సంబంధించి మరింత సమాచారం సేకరించి మూడు దశల్లో దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. మూడు దశల్లో నిందితుల ఆచూకీ కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు.

 

మహాలక్ష్మి హత్య కేసులో మొదటి మూడు ఆధారాలు విచారణకు ముఖ్యమైనవి అని పోలీసులు బావిస్తున్నారు. మొబైల్ రిట్రీవ్, టవర్ డంప్, సీడీఆర్ రికార్డులు ఇప్పుడు పోలీసులకు ముఖ్య ఆధారాలుగా మారాయి. సెప్టెంబర్ 2వ తేదీన హత్యకు గురైన మహాలక్ష్మి మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది. స్విచ్ ఆఫ్ చేయబడిన మొబైల్ ఫోన్ అన్‌లాక్ చేయబడుతుంది. మొబైల్ ఫోన్‌లో చాటింగ్, గ్యాలరీని బెంగళూరు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ చాట్‌లలో మహాలక్ష్మితో గొడవలు పడుతున్న వ్యక్తులు, ఆమెతో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తుల గురించి బయటపడే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

 

ఆ తరువాత మహాలక్ష్మి హత్య జరిగిన ప్రదేశంలో టవర్ ట్రేస్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ ఉందో గుర్తిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఏఏ ఫోన్ నంబర్లు ఉన్నాయి అని వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. దానితో పాటు మహాలక్ష్మి చివరి కాల్స్‌పై కూడా విచారణ జరుగుతోంది. మహాలక్ష్మి ఫోన్ నంబర్‌ని సీడీఆర్‌లో పెట్టి ఆమెకు ఎవరెవరు ఫోన్ కాల్ చేశారో కనిపెడుతున్నారు. నెల రోజుల నుంచి మహాలక్ష్మి ఎవరెవరితో మాట్లాడింది అనే డేటా బయటకులాగుతున్నారు.

 

మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులకు ఎక్కువగా సీసీటీవీల క్లిప్పింగ్స్ పై కన్ను వేశారు. మహాలక్ష్మి ఎప్పుడు ఇంటికి వచ్చిందో సీసీటీవీల ద్వారా గుర్తించారు. మహాలక్ష్మి వెనుక ఆమె ఇంటి వరకు ఎవరెవరు వచ్చారో కూడా బెంగళూరు పోలీసులు తనిఖీ చేశారు. మహాలక్ష్మి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయిన వారు ఎవరు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.చిక్కిన సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా చేసుకుని హంతకుడి మూలాన్ని తెలుసుకుని అరెస్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

 

మూడవ క్లూ పోస్టుమారు్టం నివేదికలో చిక్కుతుందని పోలీసులు అంటున్నారు. పై రెండు రకాల దర్యాప్తు కష్టంగా ఉన్నప్పుడు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చెయ్యాలని పోలీసులు బావిస్తున్నారని తెలిసింది. పోస్టుమార్టం రిపోర్టులో హత్యకు ముందు ఏం జరిగింది అని తెలిసే అవకాశం ఉంటుందని ఓ పోలీసు అధికారి అంటున్నారు. మహాలక్ష్మిని దారుణంగా హత్య చేసిన తరువాత ఆమె మృతదేహాన్ని ఛిద్రం చేశారు. మహాలక్ష్మి శవాన్ని ఏకంగా 59 ముక్కలుగా నరికేశారు.

 

మహాలక్ష్మి హత్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. మహాలక్ష్మిని లైంగిక సంబంధం కారణాలతో హత్య చేశారా? ఆమెపై లైంగిక దాడి జరిగిందా?, హత్యకు గల కారణాలు ఏమిటి అని వెలికితీస్తామని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ సమాచారం నిందితులకు క్లూగా నిలుస్తుందని, ఈ కోణంలో పోలీసుల విచారణ సాగుతోందని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

 

బెంగళూరు మహిళ శవాన్ని ముక్కలుగా నరికేసి ఆమె శరీరంలోని ముక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టడం కలకలం రేపుతోంది.కూతురు మహాలక్ష్మి మృతదేహాన్ని ఫ్రిడ్జ్ లో చూసి ఆమె తల్లి మీనా రాణా హడలిపోయింది.. ఫ్రిడ్జ్ తెరిచి కూతురు మహాలక్ష్మి మృతదేహాన్ని చూసిన మీనా రాణా భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. కూతురు మహాలక్ష్మిని అలాంటి పరిస్థితి చూడలేక తల్లి మీనా తల్లడిల్లిపోయింది. పేగులు ఛిద్రమైన కూతురు మహాలక్ష్మి మృతదేహాన్ని చూడలేక తల్లి మీనా రాణా కేకలు వేసిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు మహాలక్ష్మి ఆర్తనాదాల చేస్తున్న సమయంలో కొందరు తీసిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |