UPDATES  

NEWS

 ssmb29 టైటిల్ రివీల్ చేసిన రాజమౌళి..!

ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం SSMB29. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం భారీ అంచనాలను పెట్టుకుంది. గుంటూరు కారం సినిమా తరువాత మహేష్.. తన టైమ్ మొత్తాన్ని జక్కన్న చేతిలో పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది.

 

ఇంకోపక్క ఈ చిత్రం కోసం మహేష్ .. లుక్ పరంగా, ఫిట్ నెస్ పరంగా రెడీ అవుతున్నాడు. గడ్డం, జుట్టు పెంచుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త వచ్చినా.. సెకన్స్ లో వైరల్ గా మారిపోతుంది. మొన్నటివరకు ఈ సినిమా టైటిల్ అది, ఇది అనుకుంటూ రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ ను రాజమౌళినే చెప్పుకొచ్చేసాడు.

 

తాజాగా జక్కన్న.. ఒక ఈవెంట్ లో పాల్గొన్న జక్కన్న తన మైండ్ లో ఉన్న టైటిల్ పేరును చెప్పుకొచ్చాడు. బాహుబలి తరువాత మీ మైండ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి అని ఒక అభిమాని అడగగానే.. ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ గరుడ.. గరుడ అని అరవడం మొదలుపెట్టారు. ఇక దీనికి సమాధానంగా రాజమౌళి మాట్లాడుతూ.. ” అవును నా మైండ్ లో కూడా గరుడ ఉంది. కానీ, ఇంతకుమించి ఎక్కువ డిటైల్స్ ను నేను ఇప్పుడు బయటపెట్టలేను” అని చెప్పుకొచ్చాడు.

 

ఇక ఆ ఒక్క మాటతో SSMB29 టైటిల్ గరుడ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ వీడియో వచ్చిన సెకండ్స్ లోనే మహేష్ బాబు గరుడ పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే గరుడనే నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి త్వరలోనే జక్కన్న గరుడ టైటిల్ ను రివీల్ చేస్తాడేమో చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |