ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ సమావేశయ్యారు. శుక్రవారం ఉదయం అమరావతిలో ఇరువురు భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగానే వివిధ అంశాలపై చర్చించారు. చంద్రబాబు సర్కార్ విజన్ గురించి అడిగి తెలుసుకున్నారు. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కానుంది. దీనికి కో-ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు.
ఏపీలో పెట్టుబడుల గురించి సీఎం చంద్రబాబు-టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మధ్య చర్చలు జరిగా యి. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 రూప కల్పన అంశాలపై మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచన లు, సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది చంద్రబాబు సర్కార్. దీనికి కో-ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు.
అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో నెలకొల్పనున్న గ్లోబల్ లీడర్‌షిప్ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో టాటా గ్రూపు భాగస్వామి కానుంది. విశాఖలో టీసీఎస్ సెంటర్ ఏర్పాటు, ఎయిరిండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ విస్తరణ అంశాలపై సీఎం చంద్రబాబుతో మంతనాలు జరిపారు. మరోవైపు సోలార్, టెలికమ్యూనికేషన్స్, ఫుడ్ ఫ్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపైనా చర్చ జరిగినట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.