టీజీపీఎస్సీ తాజాగా కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పులు చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పులు చేసినట్లు టీజీపీఎస్సీ పేర్కొన్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను తొలుత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తాజాగీ పరీక్షా సమయాలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
31,382 మంది అభ్యర్థులు క్వాలిఫై..
తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్ 9వ తేదీన టీడీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 4.03 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యారు. 1:50 నిష్పత్తిలో ఈ పరీక్షా ఫలితాలను జులై 7న టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు క్వాలిఫై అయినట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నామంటూ టీజీపీఎస్సీ ఆ సందర్భంగా పేర్కొన్నది.
తెలంగాణ గ్రూప్ -1 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూలు..
అక్టోబర్ 21, 2024 – జనరల్ ఇంగ్లీష్ (అర్హత సాధిస్తే చాలు)
అక్టోబర్ 22, 2024 – పేపర్ -1 (జనరల్ ఎస్సే)
అక్టోబర్ 23, 2024 – పేపర్ -2 (హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ)
అక్టోబర్ 24, 2024 – పేపర్ -3 (ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)
అక్టోబర్ 25, 2024 – పేపర్ -4 (ఎకానమీ అండ్ డెవలప్ మెంట్)
అక్టోబర్ 26, 2024 – పేపర్ -5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ ప్రిటేషన్)
అక్టోబర్ 27, 2024 – పేపర్ -6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ)