విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ తరఫున బరిలో నిలిచిన బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బొత్స నామినేషన్ ఒక్కటే మిగిలింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి కూడా బరిలో నిలువలేదు. దీంతో ఇద్దరు మాత్రమే బరిలో నిలిచారు.
నేడు నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కానున్న సమయంలో స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఒక్కరే అభ్యర్థిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక దాదాపుగా ఏకగ్రీవమైనట్లే. అయితే, అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
Post Views: 38