UPDATES  

NEWS

 నీట్ పేపర్ నిజంగానే లీక్ అయింది.. దర్యాప్తులో సంచలన విషయాలు..!

ఎంతో మంది విద్యార్థులు కష్టపడి నీట్ కు సిద్దమవుతుంటారు. కొంత మంది విద్యార్థులు లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్లి మరీ పరీక్ష రాస్తుంటారు. అలాంటి నీట్ పరీక్ష నిర్వహణ ఈసారి వివాదంగా మారింది. కొంత మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయిందని సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నీట్ పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. కానీ బిహార్ ఆర్థిక నేరాల విభాగం నీట్ పేపర్ లీక్ పై విచారణ చేపట్టింది. విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది.

 

నీట్‌ పేపర్‌ లీక్‌ చేసినందుకు కొందరు అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పలు జాతీయ మీడియాల్లో కథనాలు కూడా వస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు రావడంతో బిహార్ ప్రభుత్వం విచారణ చేయడం కోసం సెట్ నియమించింది. ఈ కేసు విచారణలో భాగంగా 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు తెలిసింది. బిహార్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్‌ ఇంజినీర్‌ నిందితుల్లో ఒకరిగా తేల్చారు.

 

పేపర్‌ లీక్‌ గ్యాంగ్‌తో కలిసి తాను అక్రమాలకు పాల్పడినట్లు ఆ జూనియర్‌ ఇంజినీర్‌ విచారణలో అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. మే 4వ తేదీన ఆ గ్యాంగ్‌లోని మాకు నీట్‌ (NEET) ప్రశ్నపత్రం లభించిందని సదరు నిందితుడు చెప్పినట్లు తెలిసింది. ఈ పేపర్‌ కోసం కొంతమంది అభ్యర్థుల నుంచి మేం రూ.30లక్షల నుంచి రూ.32 లక్షల చొప్పున తీసుకున్నట్లు అతను ఒప్పుకున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 13 మంది నీట్ రాసే విద్యార్థులు పేపర్ లీక్ ఉన్నట్లు తెలుస్తోంది.

 

అయితే ఇప్పటికే ఎన్టీఏ నీట్ కు సంబంధించి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టులో నీట్ కు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |