నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా “NBK109 ” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే బాలయ్య తన ఫేవరేట్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో మరో సినిమా చేయనున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త గత కొన్ని రోజులుగా బాగా వైరల్ అయింది.అయితే నేడు (జూన్ 10 )బాలయ్య బర్త్ డే సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమాను అనౌన్స్ చేసారు.”#BB4 ” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట ,గోపీచంద్ ఆచంట భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని బాలయ్య చిన్నకూతురు నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు.తాజాగా అనౌన్స్మెంట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఒక భారీ రధ చక్రం ఒక వివిక్త ప్రదేశంలో ఉంచబడింది.ఈ సారి మరింత భారీగా ఈ సినిమా వుండనుందని మేకర్స్ ఈ పోస్టర్ తో హింట్ ఇచ్చారు. ఈ సినిమా అఖండ సీక్వెల్ గా తెరకెక్కనుందని తెలుస్తుంది.అఖండ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో నట విశ్వరూపం చూపించారు.ఈ సీక్వెల్ లో అంతకు మించి భారీ యాక్షన్ సీక్వెన్స్ బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.