UPDATES  

NEWS

 చిరు కాళ్లు మొక్కి ఆశీస్సులు తీసుకున్న పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..!

జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్నాడు. 21 స్థానాల్లో నిలబడి 21 స్థానాలను అందుకున్నాడు. ఇప్పటివరకు రాజకీయ చరిత్రలో ఎవరు సాధించలేని రికార్డ్ ను అందుకున్నాడు. ఇక ఘనవిజయం తరువాత ఢిల్లీ వెళ్లి NDA ను కలిసి వచ్చాడు. ఇక వచ్చి రాగానే మొదటిసారి అన్న చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు అందుకున్నాడు.

 

అఖండ విజయం అందుకున్న పవన్ కు కొణిదెల కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. పూల వర్షంతో పవన్ ను ఆహ్వానించారు. ఇక ఇంటికి రాగానే పవన్ .. అన్న చిరు కాళ్లు మొక్కి ఎమోషనల్ అయ్యాడు. పవన్ ను లేపి.. చిరు ముద్దుపెట్టి లోపలి ఆహ్వానించాడు. కొణిదెల కుటుంబం మొత్తం సంబురాల్లో నిండిపోయారు. పవన్ క శుభాకాంక్షలు తెలిపారు.

 

అనంతరం పవన్ చేత కేక్ కట్ చేయించారు. ఇక వదిన సురేఖ.. పవన్ దంపతులకు బట్టలు పెట్టి గౌరవించింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, రామ్ చరణ్ భార్య ఉపాసన అలాగే మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు మనవరాళ్ళు, మనవళ్లు, వరుణ్ తేజ్ ఆయన భార్య లావణ్య, నిహారిక సహా అందరూ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |