రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. గత నెలలో బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో పార్టీ విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ నటి హేమకు పోలీసులు రెండు సార్లు నోటీసులు పంపించినా హాజరుకాలేదు. అయితే, తాజాగా ఆమెకు మరోసారి నోటీసులు రావడంతో హేమ మంగళవారం విచారణకు హాజరయ్యింది. విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
అయితే, బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని సీసీబీ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.
కాగా, డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు ఆమెకు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. మొదటిసారి తనకు వైరల్ ఫీవర్ అంటూ సాకు చెప్పింది. రెండోసారి నోటీసులపై స్పందించలేదు. ఈ క్రమంలో హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆమెను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అంతకంటేముందు హేమను అరెస్ట్ చేసే అవకాశముందంటూ ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది.
మే 20న బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న జీఆర్ ఫామ్ హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది. నార్కోటిక్స్ టెస్ట్ లో ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్ పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే.
విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు.. అనేకల్ లోని నాలుగో అదనపు సివిల్, జేఎంఎఫ్ సీ కోర్డు జడ్జి ముందు హాజరుపరచగా, జూన్ 14 వరకు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.