ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ రోజు, పోలింగ్ ముగిసిన తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలు, చోటుచేసుకున్న అనేక సంఘటనలు ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పోలింగ్ సందర్భంగా ఏపీలో పోలీస్ యంత్రాంగం ఫెయిల్ కావడంపైన కేంద్ర ఎన్నికలకమిషన్ కూడా సీరియస్ అయింది. ఈ క్రమంలో రేపు ఓట్ల లెక్కింపు జరగనున్న కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది ఎన్నికల కమిషన్.
ఏపీలో భారీగా కేంద్ర బలగాలు ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు మోహరించి పహార కాస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ లను ఏర్పాటు చేశారు. రేపు కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు.
ఏపీలో అడుగడుగునా భద్రత ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించి వారిని బైండోవర్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించి, రౌడీ షీటర్ లను బైండోవర్ చేశారు. కొంతమందిపై నగర బహిష్కరణ వేటు వేశారు. అంతేకాదు సమస్యాత్మక ప్రాంతాలలో నిఘా పెంచారు. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలతో క్షుణ్ణంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి 20 కంపెనీల బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు.
ఏపీలో మోహరించిన 90 వేల మంది భద్రతా బలగాలు ఏపీలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా ఎన్నికల కమిషన్ సూచనలతో 90 వేల మంది భద్రతా బలగాలు ఏపీలో మోహరించాయి. దాదాపు 60వేల మంది సివిల్ పోలీసులు 20,000 మంది సిబ్బంది, ఎనిమిది వేల మంది సాయుధ బలగాలు కౌంటింగ్ కి విధులు నిర్వర్తించనున్నారు. మొత్తం 45,960 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులతో పాటు 3500 మంది కర్ణాటక పోలీసులు, 4500 మంది తమిళనాడు పోలీసులు కూడా ఏపీలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఏపీలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ తో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ కూడా భద్రతా విధుల్లో 3366 మంది పోలీసు సిబ్బందితో పాటు, 1622 మంది హోంగార్డులు కౌంటింగ్ సెక్యూరిటీ విధులను నిర్వర్తిస్తున్నారు. వీళ్లకు తోడుగా రాష్ట్రవ్యాప్తంగా 1,8609 మందిని ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణకు ఈసీ మోహరించేలా చేసింది. వీరిలో 13,739 మంది ఎన్ఎస్ఎస్ సిబ్బంది 3 వేల 10మంది ఎన్సిసి, 1614 మంది ఎక్స్ సర్వీస్ మెన్, 246 మంది రిటైర్డ్ పోలీస్ సిబ్బంది కూడా విధులను నిర్వర్తిస్తున్నారు.
ఏ చిన్న గొడవ జరిగినా తాట తీసుడే రాష్ట్రంలో అడుగడుగు క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు ఏ చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకున్న తాట తీస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ తరహాలో దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.