UPDATES  

NEWS

 సెక్స్ స్కాండల్ కేసు, ఆదేశం నుంచి ఎంపీ వీడియో విడుదల..!

సిట్ అధికారుల విచారణలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోను విడుదల చేసిన స్థలం గురించిన సమాచారం బయటకు వచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణవి అని చెబుతున్న అశ్లీల వీడియోలను విడుదల చేసిన నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పుడు విదేశాల్లో ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ దాక్కున్నాడు అని సిట్ అధికారులు ఆధారాలు సేకరించడం హాట్ టాపిక్ అయ్యింది.

సోమవారం ప్రజ్వల్ రేవణ్ణ విడుదల చేసిన వీడియో ఎక్కడ నుంచి విడుదల చేశాడు అనే దానిపై సిట్‌కు కీలక సమాచారం లభించింది. అశ్లీల వీడియోలు విడుదల కాగానే హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లిపోయారు. ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయాలని ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సిట్ టీమ్ అశ్లీల వీడియోలపై విచారణ జరుపుతోంది. ఇందుకోసం ప్రజ్వల్ రేవణ్ణకు కూడా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.

ఈ పరిణామాల మధ్య సోమవారం నాడు ప్రజ్వల్ రేవణ్ణ విడుదల చేసిన వీడియోలో మే 31వ తేదీన తాను సిట్ విచారణకు హాజరవుతానని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ప్రజ్వల్ కూడా విమానం టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఈలోగా ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడి నుంచి వీడియో విడుదల చేశారనే సమాచారాన్ని సిట్ సేకరించింది. యూరప్‌లోని హంగేరీలోని బుడాపెస్ట్ నుండి హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియో విడుదల చేశారని సిట్ గుర్తించిందని వెలుగు చూసింది.

 

వీడియో విడుదలైన మొబైల్ ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేయడం ద్వారా సిట్ ఈ సమాచారాన్ని సేకరించిందని తెలిసింది. వీడియో స్టేట్‌మెంట్‌ను విడుదల చేయడానికి రెండు రోజుల ముందు రికార్డ్ చేసినట్లు సిట్ సాంకేతిక బృందం కూడా గుర్తించింది. మే 31వ తేదీన జరిగే సిట్ విచారణకు హాజరవుతానని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో యూరప్ నుంచి విడుదల అయ్యిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

అశ్లీల వీడియోలు విడుదలైన దాదాపు నెల రోజుల తర్వాత ప్రజ్వల్ తన స్టేట్‌మెంట్ వీడియోను విడుదల చేశాడు. అంతకుముందు ఆయన జర్మనీలో ఉన్నారని చెప్పారు. కానీ ప్రజ్వల్ విడుదల చేసిన వీడియో యూరప్ నుంచి పంపినట్లు సిట్ గుర్తించింది. ప్రజ్వల్ దేశానికి రాగానే అరెస్ట్ చేసి విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. భారత్ లో ఎక్కడ అడుగుపెట్టినా ప్రజ్వల్ రేవణ్ణను ఎయిర్ పోర్టులోనే అరెస్టు చెయ్యాలని సిట్ అధికారులు బావించారని తెలిసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |