తెలంగాణ రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన తరువాత మూడు పార్టీలు మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ముఖ్యుల మద్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆ 32 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కేసీఆర్ హయాంలోనే రేవంత్ తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చినట్లుగా చెబుతున్నవి కేసీఆర్ హాయంలోనే ఆమోదించినవని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆ 32 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను కేటీఆర్ బట్టబయలు చేశారు.
ఈ ఉద్యోగాలకు రేవంత్ కేవలం నియామక పత్రాలు మాత్రమే అందజేసినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. 32,517 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆరేనని కేటీఆర్ తేల్చిచెప్పారు. మీరు 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు… రాతపరీక్ష ఎప్పుడు నిర్వహించారు… ఫలితాలు ఎప్పుడు ఇచ్చారో తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని డిమాండ్ చేసారు.
లెక్కలు ఇలా గురుకులాల్లో 9,210 టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 2023లో నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేసారు. ఆగస్టు 2023లో రాతపరీక్షలు నిర్వహించారని చెప్పారు. ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 2024లో విడుదలయ్యాయని వివరించారు.
ఈ పోస్టుల భర్తీని కూడా రేవంత్ తన ఖాతాలో వేసుకున్నారని చెప్పుకొచ్చారు. పోలీసు శాఖలో 17,516 ఉద్యోగాలకు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చాం. జూన్ 2023లో రాతపరీక్షలు నిర్వహించామన్నారు. అక్టోబర్ 4, 2023లో ఫలితాలు వచ్చాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో భర్తీ ప్రక్రియ ఆగిపోయిందని వివరించారు.
రేవంత్ ఖాతాలో పోలీసు ఉద్యోగాల భర్తీ కేసీఆర్ హయాంలోనే జరిగిందని కేటీఆర్ వివరించారు. 587 ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. ఏప్రిల్ 2023లో రాతపరీక్ష నిర్వహించి, ఆగస్టు 7 2023లో ఫలితాలు ప్రకటించామని చెప్పుకొచ్చారు. కానీ న్యాయపరమైన చిక్కుల వల్ల నియామక పత్రాలు ఇవ్వలేకపోయామన్నారు.
ఈ ఉద్యోగాలకు రేవంత్ కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారన్నారు. 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది మాత్రం కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మొత్తం కలుపుకుంటే కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక లక్షా 92 వేల పైచిలుకు ఉద్యోగాలు అని కేటీఆర్ లెక్కలు చెప్పారు.