ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నేటితో నామినేషన్ల ఘట్టం పూర్తి కానుంది. ముఖ్యమంత్రి జగన్ తో సహా పోటీలో ఉన్న అభ్యర్దులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నెల 29వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. పోటీలో ఉండే అభ్యర్దులతో పాటుగా రెబల్స్ పైనా క్లారిటీ రానుంది. ఇక..మే 11వ తేదీ వరకు ప్రచార జోరు పెరగనుంది. చివరి నిమిషంలో దాఖలు చేసే అభ్యర్దుల పైన పార్టీలు ఫోకస్ చేసాయి.
నామినేషన్లకు లాస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గురువారంతో నామినేషన్ల గుడువు ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి ఈ సారి యువత ఎక్కువగా మొగ్గు చూపుతోంది. ప్రధాన పార్టీలు ప్రకటించిన అభ్యర్దుల పైనే అందరి ఫోకస్ ఉంది. కానీ, స్వతంత్ర..రెబల్ అభ్యర్దులు నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేయనున్నారు. హోరా హోరీగా సాగుతున్న ఈ ఎన్నికల పోరుతో ప్రతీ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఈ రోజు నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత 27వ తేదీ వరకు స్క్రూటినీ జరగనుంది. 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. పోటీలో ఉన్న రెబల్స్ ను బుజ్జగించి వారిని విత్ డ్రా చేసుకొనే విధంగా చేయటానికి 29వ తేదీ డెడ్ లైన్. దీంతో, పార్టీలు అలర్ట్ అవుతున్నాయి.
పులివెందులకు జగన్ ఇప్పటి వరకు ఏపీలో అసెంబ్లీకి 3,644..అదే విధంగా లోక్ సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్క రోజే అసెంబ్లీకి 1,294, లోక్ సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బుధవారం నామినేషన్లు దాఖల చేసిన ప్రముఖుల్లో బీజేపీ నుంచి పురందేశ్వరి, జనసేన నుంచి బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. వైసీపీ, టీడీపీ నుంచి మరికొందరు ముఖ్యులు చివరి రోజున ఈ రోజు నామినేషన్ల దాఖలుకు సిద్దమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ పులివెందుల నుంచి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పులివెందులలో జరిగే సభలో పాల్గొని..ఆ తరువాత నామినేషన్ దాఖలు చేసేందుకు జగన్ షెడ్యూల్ ఖరారైంది. రేపు జగన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
హోరా హోరీ పోటీ కూటమి నుంచి పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు రెబల్స గా పోటీలో నిలుస్తున్నారు. వారి మద్దతు దారులు, కుటుంబ సభ్యులతో నామినేషన్లు దాఖలు చేయించారు. అటువంటి వారిని బుజ్జగించేందుకు పార్టీల నేతలు రంగంలోకి దిగారు. ఇక..చంద్రబాబు – పవన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రచారానికి సిద్దమయ్యారు. మే 11వ తేదీ లోగా దాదాపు 60 ప్రచార సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్దం అవుతోంది. దీంతో..ఈ రోజున ఎన్నికల్లో పోటీ చేయాలనుకొనే వారికి చివరి అవకాశం. దీంతో..చివరి నిమిషం లో దాఖలయ్యే నామినేషన్ల పైన పార్టీలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఇక..పోటీలో నిలిచే వారి జాబితా అధికారికం కానుంది.









