UPDATES  

NEWS

 ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత లేఖ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. అయితే, ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యర్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వయోపరిమితిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం రామకృష్ణ లేఖ రాశారు.

 

2018 తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని రామకృష్ణ తన లేఖలో గుర్తుచేశారు. అప్పటి నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు వేచి చూస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో అభ్యర్థుల్లో వయోపరిమితిపై ఆందోళన నెలకొందని చెప్పారు. వయోపరిమితి 47 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని, మెగా డీఎస్సీ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని రామకృష్ణ తన లేఖలో సీఎం చంద్రబాబును కోరారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |