జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, దురదృష్టవశాత్తు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ జనసేన మండిపడింది. పవన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని తెలంగాణ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్ అన్నారు. వెంటనే ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదన్నారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కవితకు పవన్ గురించి మాట్లాడే హక్కులేదని, కవిత నోరు అదుపులో పెట్టుకోవాలని శంకర్‌గౌడ్ హెచ్చరించారు.
Post Views: 9