UPDATES  

NEWS

 పార్లమెంట్ కు వెళ్లబోతున్న రామ్ చరణ్..? ఎందుకంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) ఈ ఏడాది గేమ్ ఛేంజర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ మూవీ మిక్సీ్డ్ టాక్ ను అందుకోవడంతో ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. ఈసారి ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా ఇస్తానంటున్నాడు బుచ్చిబాబు.. వీరిద్దరి కాంబినేషన్లో చరణ్ 16 వ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా రామ్ చరణ్ పార్లమెంట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో పార్లమెంట్ కు వెళ్తున్నాడని ఫుల్ ఖుషి అవుతున్నారు.. అసలు చరణ్ పార్లమెంట్ కు ఎందుకు వెళ్తున్నాడు? రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? లేదా మరేదైన కారణాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..

 

అవును మీరు విన్నది అక్షరాల నిజం.. రామ్ చరణ్ పార్లమెంట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు.. పార్లమెంట్ లోకి సాధారణ వ్యక్తులు అడుగు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే దాని వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు, కేవలం సినిమా షూటింగ్ కోసం మాత్రమే ఆ మూవీ టీం పార్లమెంట్ ని షూటింగ్ కోసం ఒక రోజు ఇవ్వాలని కోరారట. ఇదే ఇప్పుడు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న టాపిక్.. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు ( Buchchibabu ) తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి.. ప్రస్తుతం ఢిల్లీలో కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో అత్యంత కీలకమైన సన్నివేశం పార్లమెంట్ లో జరుగుతుందట..

 

షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్స్ మీద కాకుండా న్యాచురల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే డమ్మీ పార్లమెంట్ కాకుండా రియల్ స్థలంలో సినిమా చేస్తే జనాలు కాస్త ఆసక్తి చూపిస్తారని మూవీ టీమ్ భావిస్తున్నారు. ఒకప్పుడు అయితే చాలా తేలికగానే షూటింగ్ కోసం పార్లమెంట్ ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా ఇవ్వడం లేదు. దాని కోసం ఎన్నో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మూవీ టీం కి ఎంత ప్రయత్నం చేసిన అనుమతులు లభించడం లేదట. దాంతో చేసేదేమి లేక ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ ( pawan Kalyan) ను సంప్రదించారని టాక్.. పవన్ కళ్యాణ్ కి ఢిల్లీ లో ఎలాంటి పలుకుబడి ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే ఆయన పలుకుబడి ని ఉపయోగించి పార్లమెంట్ ని ఒక రోజు షూటింగ్ కోసం ఇప్పించేలా చేయమని కోరారట. పవన్ కళ్యాణ్ కూడా అందుకు సానుకూలంగా రెస్పాన్స్ ఇచ్చాడట.. మరి ఫలితం ఏంటో తెలియాల్సి ఉంది.. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ( Janvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |