UPDATES  

NEWS

 మంచు లక్ష్మీ విడాకులు.. అసలేం జరిగింది.. ?

మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులు అందరు ఆమెను ప్రేమగా మంచక్క అని పిలుస్తారు. తన ఇంగ్లిష్ తో చాలా దారుణంగా ట్రోల్ అయ్యిన లక్ష్మీ.. అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే బెస్ట్ విలన్ గా అవార్డు గెలుచుకున్న ఆమె.. మంచు కుటుంబం వలన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ వచ్చింది.

 

ఇక ప్రస్తుతం మంచు లక్ష్మీ ముంబైకు మకాం మార్చిన విషయం తెల్సిందే. అక్కడే బాలీవుడ్ లో అవకాశాలను అందుకుంటూ కూతురుతో కలిసి నివసిస్తోంది. గత కొన్ని రోజులుగా మంచు బ్రదర్స్ మధ్య గొడవ జరుగుతున్నా ఆమె ఆ గొడవల్లో అస్సలు తలదూర్చలేదు. ఇక అక్కడ ఒక పక్క సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క ఒక పాడ్ క్యాస్ట్ పెట్టి స్కిన్ గురించి నిపుణులతో మాట్లాడుతూ తెలియని విషయాల గురించి ప్రజలకు తెలియబరుస్తుంది.

 

మంచు లక్ష్మీ గురించి ఏదో ఒక విషయం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. గత కొన్నిరోజులుగా లక్ష్మీ.. తన భర్తకు విడాకులు ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మంచు లక్ష్మీకి 2006 లో యాండీ శ్రీనివాస్ తో వివాహం జరిగింది. వీరికి విద్య నిర్వాణ అనే పాప ఉంది. ఆమె లక్ష్మీ ప్రపంచం. ఎప్పుడు ఎక్కడకు వెళ్లినా కూతురును వదిలేసి మాత్రం ఎక్కువ రోజులు ఉండదు. భర్తతో ఆమె కనిపించేది చాలా తక్కువ. ఎప్పుడో ఫ్యామిలీ ఫంక్షన్స్ తప్ప ఎప్పుడు జంటగా కనిపించింది లేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా భర్తకు సంబంధించిన ఫోటోలు ఎక్కడ కనపడనివ్వదు. ఎప్పటినుంచో లక్ష్మీ భర్తకు విడాకులు ఇచ్చిందని, దానికి కారణం తండ్రి మోహన్ బాబు అంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇంతకాలానికి ఆమె వీటిపై క్లారిటీ ఇచ్చింది.

 

ఇక మంచు లక్ష్మీ.. తాజాగా ఒక ఆంగ్ల ఇంటర్వ్యూ లో తన విడాకుల పుకార్ల గురించి స్పందించింది. తాను విడాకులు తీసుకోలేదని, తన భర్త విదేశాల్లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ” నా భర్త శ్రీనివాస్ విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఆయన ఇండియాలో చాలా తక్కువ ఉంటారు. పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఒకరికొకరం గౌరవం ఇచ్చుకుంటాం. ఇక్కడ కచ్చితంగా ఆయన అవసరం ఉంది అంటే వస్తారు. అనవసరమైన వాటి గురించి మేము ఆలోచించం. ఎక్కువ అంచనాలు పెట్టుకోము.. ముఖ్యంగా వేరేవారు మా గురించి ఏమనుకుంటున్నారు అనేది అస్సలు పట్టించుకోము.

 

మా ఇద్దరికీ ఏది ఇష్టమో అదే చేస్తాం. అలాగే బ్రతకాలని అనుకుంటాం. అలాగే జీవిస్తున్నాం కూడా. మా వైవాహిక బంధం ఇప్పుడు బాగానే ఉంది. కెరీర్ కోసమే మేము వేరు వేరు చోట్ల ఉన్నాము. పాప అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇప్పుడు నా కూతురు తండ్రివద్దనే ఉంది. టైమ్ ఉన్నప్పుడల్లా నేను మేము కలుస్తూ ఉంటాం. జనాలు ఏదో అనుకుంటారని.. వారి గురించి మేము ఆలోచించం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో సామాజిక సేవల విభాగంలో కళారత్న (హంస) అవార్డుకి ఎంపికైన అవే సంస్థ వ్యవస్థాపకుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారాత్న (హంస) అవార్డును అందుకోవడం జరిగినది..

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |