UPDATES  

NEWS

 నేడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. హాజరవుతున్న కేసీఆర్..

చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాహ్యప్రపంచంలోకి వస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరవుతుండడంతో దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. ఈ ఏడాది 25వ వసంతంలోకి ప్రవేశించబోతోంది. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

 

ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ లు, జిల్లా అధ్యక్షులు, ఇతర విభాగాల అధ్యక్షులు హాజరవుతున్నారు. ఈ సమావేశం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |