UPDATES  

NEWS

 చిరు సినిమాకు అనిరుధ్ మ్యూజిక్..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ట ఈ సినిమాను విజువల్ వండర్‌గా, సోషియో పాంటసీ డ్రామాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నారు. ఊహించని విధంగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా అనౌన్స్ చేశారు.

 

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ అనిరుధ్ పేరు గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పుడు అనిరుధ్ దాదాపు లాక్ అయ్యినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్‌కి అనిరుధ్ ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇప్పుడున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో అనిరుధ్ హవా నడుస్తోంది. ఒక్కో సినిమాకు అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటూ దూసుకుపోతున్నాడు. తెలుగులో చివరగా దేవర సినిమాతో అదరగొట్టాడు అనిరుధ్. ఈ సినిమాకు ఆయన ఇచ్చిన బీజిఎం హైలెట్‌గా నిలిచింది. గతంలో విక్రమ్, జైలర్ సినిమాలను తన బీజిఎంతో నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు అనిరుధ్. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం పని చేస్తున్నాడు. త్వరలో ఇందుకు సంబంధించి త్వరలో అధికారక ప్రకటన రానుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |