UPDATES  

NEWS

 ఎన్టీఆర్ – నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ఫిక్స్.!

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది “దేవర” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. దేవరతో బాలీవుడ్ లోను తన మార్కెట్ ను పదిలం చేసుకున్నాడు తారక్. అటు మలయాళం, తమిళ్ లోను సూపర్ హిట్ రిజల్ట్ అందుకున్నాడు యంగ్ టైగర్. ప్రస్తుతం ఎన్టీయార్ సినిమాలపై రోజుకొక న్యూస్ విపిస్తున్నాయి.

 

ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ -2ను ఫినిష్ చేసాడు తారక్. ఆగష్టు 2025లో విడుదల కానుంది వార్ – 2. దాంతో పాటుగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను ఈ మధ్య మొదలెట్టాడు ఈ సినిమా సంక్రాంతికి 2026లో విడుదల కానుంది. అయితే తమిళ స్టార్ దర్శకుడు జైలర్, బీస్ట్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్‌కుమార్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు అని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నెల్సన్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలిసింది. నెల్సన్ చెప్పిన కథకు ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే, 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అటు నెల్సన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమో సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎన్టీఆర్, నెల్సన్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై సితార నాగవంశీ నిర్మించనున్నాడు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |