తేజ సజ్జ(Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prashanth Varma)దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హనుమాన్(Hanuman). ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి, గత ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు పోటీగా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం (Guntur karam)సినిమా కూడా నిలవలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తన టేకింగ్ తో సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లారో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే చిన్న సినిమాగా విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. మరోవైపున ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’ (Jai Hanuman) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ప్రశాంత్ వర్మ ప్లానింగ్ కి అందరూ ఫిదా అవుతున్నారు.
వచ్చే యేడాది జై హనుమాన్ రిలీజ్..
జై హనుమాన్ సినిమాని 2025లో రిలీజ్ చేస్తానని ప్రకటించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రకటన అయితే జరిగింది కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వరుసగా వస్తూ.. అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా కాంతార (Kantara)సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న డైరెక్టర్ కం హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty) ఇందులో ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేయగా ఇప్పుడు మరొక ఫోటో రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు ప్రశాంత్ వర్మ.
జై హనుమాన్ లో దగ్గుబాటి రానా..
ఇందులో దగ్గుబాటి రానా(Daggubati Rana)ని కూడా తీసుకొచ్చాడు. దగ్గుబాటి రానా, రిషబ్ శెట్టితో కలిసి ప్రశాంత్ వర్మ దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇది “జై హనుమాన్ కాదు జై జై హనుమాన్” అని అర్థం వచ్చేలా కామెంట్ చేశారు ప్రశాంత్ వర్మ. ఈ విషయం తెలిసి రానా అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రానా కూడా భాగమవుతున్నాడు అంటే కచ్చితంగా ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్తుంది అంటూ అంచనాలు పెంచేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రానా ఏ పాత్రలో నటించబోతున్నారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు ప్రశాంత్ వర్మ.
సస్పెన్స్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ..
హనుమాన్ సినిమా విడుదల సమయంలో గ్రాఫిక్స్ లో చూపించిన హనుమాన్ కాస్త రానాకి దగ్గరగా ఉన్నాడు అని, అందుకే ఇక్కడ రానా నే హనుమంతుడిగా కనిపించబోతున్నాడు అనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆంజనేయ స్వామిగా రిషబ్ శెట్టి కనిపించారు. మరి ఇద్దరిలో ఎవరు ఆంజనేయ స్వామి పాత్ర చేస్తున్నారనే విషయం సస్పెన్స్ గా ఉంచబోతున్నారని సమాచారం. ఏది ఏమైనా ఒకే తరహా పాత్రలతో వీరిద్దరూ ప్రేక్షకులను మెప్పించబోతారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదిఏమైనా ఈ అనుమానాలు, సందేహాలు అభిమానులకే వదిలేస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఇక దీనిపై పూర్తి క్లారిటీ రావాలి అంటే ప్రశాంత్ వర్మ ఈ ఇద్దరి పాత్రల గురించి అధికారికంగా ప్రకటిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ ప్లానింగ్ కి ఆడియన్స్ సైతం ఫిదా అవుతున్నారు.