UPDATES  

NEWS

 ఏడు కొత్త BSNL సేవలు లాంచ్‌..! డైరెక్ట్ టు డివైజ్ కనెక్టివిటీ సొల్యూషన్‌

బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కు ఆ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించనున్న‌ట్లు వెల్ల‌డించింది. అందులో భాగంగా కొత్త లోగోను ఆవిష్కరిస్తూ.. మంగళవారం ( అక్టోబర్ 22) ఏడు కొత్త ఫీచర్లను ప‌రిచ‌యం చేసింది. దీంతో ప్ర‌ముఖ ప్ర‌యివేటు పోటీదారుకు గ‌ట్టి షాక్ ఇచ్చిన‌ట్ల‌యింద‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

 

ఏడు కొత్త BSNL సేవలు లాంచ్‌..

 

ఇప్పటికే దేశంలో ఎంపిక చేసిన సర్కిళ్లలో బీఎస్ఎన్‌ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవ‌ల‌పై వినియోగ‌దారుల నుంచి సానుకూల స్పంద‌న రావ‌డంతో మరింత మెరుగైన సేవలను అందించేందుకు ప్రాణాళిక వేస్తోంది. ఇందులో భాగంగా అన్ వాంటెడ్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు స్పామ్ ఫ్రీ నెట్ వర్క్‌ను వంటి స‌రికొత్త ఫీచ‌ర్స్‌ను ప‌రిచ‌యం చేసింది. సెంట్ర‌ల్ కమ్యూనికేషన్స్ మినిస్ట‌ర్‌ జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలో నిర్వ‌హించిన ఓ కార్యక్రమంలో స్పామ్-ఫ్రీ నెట్‌వర్క్, వై-ఫై రోమింగ్, డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీతో సహా ఏడు కొత్త BSNL సేవలను లాంచ్ చేశారు.

 

డైరెక్ట్ టు డివైజ్ (D2D) కనెక్టివిటీ సొల్యూషన్‌..

 

అంతేకాదు, 500కి పైగా లైవ్ ఛానెల్స్, పేటీవీ ఆప్షన్లతో బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా ఫైబర్ టీవీ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇది ఇప్ప‌టికే ఫైబర్ ఇంటర్నెట్ సబ్ స్క్రైబర్‌లుగా ఉన్న వినియోగ‌దారుల‌కు అదనపు చెల్లింపులు లేకుండా అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అలాగే, బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేసేందుకు ఆటోమేటెడ్ కియోస్క్‌ల‌ను లాంచ్ చేస్తోంది. వీటితోపాటు దేశంలోనే మొట్టమొదటి డైరెక్ట్ టు డివైజ్ (D2D) కనెక్టివిటీ సొల్యూషన్‌ను ప్రారంభించి ఔరా అనిపించింది. ఈ క‌నెక్టివిటీ సొల్యూష‌న్‌ శాటిలైట్, మొబైల్ నెట్ వర్క్‌ల‌ను అనుసంధానం చేస్తుంది. ఈ సర్వీస్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |