ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం తమ బాధ్యత అని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. యువగళంలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చిందని వెల్లడించారు.
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రజలు కోరారని, ఆ మేరకు బోయ, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు పాదయాత్రలో తనకు విజ్ఞప్తి చేశారని వివరించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని నిర్వహించాలని ఉత్తర్వులు వెలువడ్డాయని లోకేశ్ తెలిపారు.
అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు
Post Views: 29