UPDATES  

NEWS

 విశ్వంభర టీజర్ డేట్ ఫిక్స్..! మెగా ఫ్యాన్స్ కు పండగే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. బింబిసార సినిమాతో మంచి హిట్ కొట్టిన వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాలో చిరు సరసన కోలీవుడ్ బ్యూటీ త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగుతుందని మేకర్స్ ముందే ప్రకటించారు.

 

అయితే గత కొన్ని రోజుల నుంచి సంక్రాంతి రేస్ నుంచి విశ్వంభర తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే రోజు రానే వచ్చింది. పండగ ఏదైనా.. చిరు సినిమా అప్డేట్ వస్తే ఆ కిక్కే వేరని చెప్పాలి. రేపు దసరా కావడంతో.. మేకర్స్ విశ్వంభర నుంచి బిగ్ అప్డేట్ రానున్నట్లు ప్రకటించారు. అదేంటంటే.. రేపు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ అధికారిక ప్రకటన అందించారు.

 

రేపు ఉదయం 10. 49 నిమిషాలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చిరు.. చేతిలో కత్తి పట్టుకొని సీరియస్ లుక్ లో కనిపించాడు. ఇక వెనుక బ్యాక్ గ్రౌండ్ లో విఎఫ్ఎక్స్ అదిరిపోయింది. పోస్టర్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.

 

అందుతున్న సమాచారం ప్రకారం.. చిరు నటించిన యముడికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల కలయికగా విశ్వంభర ఉండనున్నట్లు తెలుస్తోంది. చిరు ఇలాంటి పత్రాలు చేసి చాలా కాలమయ్యింది. దీంతో ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు టాలీవుడ్ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది.

 

ఇక ఈ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ విషయంలో కూడా మేకర్స్ ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతుందా.. ? లేక వాయిదా పడుతుందా.. ? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |