UPDATES  

NEWS

 దువ్వాడ విషయంలో మాధురి పంతం నెగ్గుతుందా.. వాణి పంతం నెగ్గుతుందా?

దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో దువ్వాడ ఫ్యామిలీ పంచాయితీని పరిష్కరించటానికి ఇరు కుటుంబాల పెద్దలు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారిన ఈ ఫ్యామిలీ పంచాయితీని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ ఓకే.. ఆ ఒక్కటి అడగొద్దు అంటూ దువ్వాడ శ్రీనివాస్ ఒక్క ప్రాపర్టీ విషయంలో పట్టు పడుతున్నారు. దువ్వాడ అంతగా పట్టు బడుతున్న ఆస్తిలో తనకు వాటా ఉందని ఇప్పటికే మాధురి మీడియాసాక్షిగా వ్యాఖ్యలు చేశారు.

 

నాలుగు డిమాండ్ లకు ఓకే అన్న దువ్వాడ

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి వర్సెస్ దివ్వెల మాధురి ల మధ్య జరుగుతున్న ప్రచ్చన్న సమరంలో సమస్యను పరిష్కరించుకోవడం కోసం చర్చలు జరుపుతున్నారు. నిన్నటి నుంచి సమస్య పరిష్కారానికి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. దువ్వాడ వాణి ప్రధానంగా దువ్వాడ శ్రీనివాస్ ముందు ఐదు డిమాండ్ లను పెట్టగా, వాటిలో నాలుగు డిమాండ్ లకు దువ్వాడ శ్రీనివాస్ ఓకే అన్నారు.

 

కొత్త ఇంటి విషయంలో నో అంటున్న దువ్వాడ

అయితే ఒక్క డిమాండ్ విషయంలో మాత్రం దువ్వాడ శ్రీనివాస్ ససేమిరా అంటున్నారు. టెక్కలిలో ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న కొత్త ఇంటిని ఆయన తదనంతరం శ్రీనివాస్ తమకు దాఖలు చేస్తామన్న విషయంపై వీలునామా తక్షణమే రాసివ్వాలని వాణి చేస్తున్న డిమాండ్ కు మాత్రం దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకోవటం లేదు. తనకంటూ మిగిలిన ఆ ఒక్క ఆస్తి విషయంలో తాను తక్షణమే వీలునామా రాస్తే తన పరిస్థితి ఏంటని దువ్వాడ ప్రశ్నిస్తున్నారు.

 

దువ్వాడ కొత్త ఇంటి విషయంలో నో అనటం వెనుక మాధురి

అయితే దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇంటి విషయంలో నో చెప్పటానికి బలమైన కారణం ఉంది. ఈ ఇంటిని కట్టటానికి తాను డబ్బులు ఇచ్చానని, అందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని దివ్వెల మాధురి మీడియా సాక్షిగా చెప్పారు. ఆ ఇంటిపైన తనకే హక్కు ఉందని పేర్కొన్నారు. ఈ ఇల్లు కావాలంటే తనదే అన్న ఆధారాలతో రావాలని వాణికి సవాల్ విసిరారు. ఆ ఇంటి విషయంలో తాను ఎక్కడిదాకా అయినా వెళ్తానని అన్నారు.

 

మాధురి పంతం నెగ్గుతుందా.. వాణి పంతం నెగ్గుతుందా?

ఇక ఈ నేపధ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్ తాను ప్రస్తుతం ఉంటున్న కొత్త ఇంటి విషయంలో వాణి డిమాండ్ కు నో అంటున్నారు. ఆ ఇంటిని మాధురి తనదిగా భావిస్తున్న క్రమంలోనే ఆయన నో అంటున్నట్టు తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ తో అర్ధం అవుతుంది. అయితే వాణి ఈ ఇంటి విషయంలో వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్తున్నారు. ఇక దువ్వాడ కూడా వెనక్కు తగ్గకపోవటంతో వీరి చర్చలకు బ్రేక్ పడింది. ఇక ఈ కుటుంబ పంచాయితీలో మాధురి పంతం నెగ్గుతుందా.. వాణి పంతం నెగ్గుతుందా? మున్ముందు ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |