జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఏపీలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 9.30 నిమిషాలకు నేరుగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు వెళ్లనున్నారు. షార్ లో ఈనెల జరుగనున్న నేషనల్ స్పేస్ డే ఉత్సవాలలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొనే ఛాన్స్ అవకాశం ఉండటంతో ఈ ఏర్పాట్లను అధికారులతో కలిసి పర్యవేక్షించనున్నారు. ఆగస్ట్ 23న చంద్రయాన్ అనే ఉపగ్రహం చంద్రుడుపై మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన రోజున నేషనల్ స్పేస్ డేని భారత ప్రధాని మోదీ ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే గడిచిన వారం రోజులుగా భారతదేశంలో ఉన్న పలు ఇస్రో సెంటర్లలో నేషనల్ స్పేస్ డే ఉత్సవాలను జరిపేందుకు అన్ని ఏర్పా్ట్లను సిద్ధం చేశారు ప్రధాని. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో జరగనున్న వేడుకల్లో చివరి రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ తరుణంలో షార్ లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఏపీ పోలీసులు.రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల సమయం వరకు షార్ లో పర్యటించి అక్కడి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్.
అంతేకాదు మొట్టమొదటి సారిగా ఈ ఉత్సవాలను ప్రధాని జరుపుతున్న తరుణంలో ప్రతిష్టాత్మకంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రజలకు కూడా ఆహ్వానం పలుకనున్నారు. అందులోనూ స్పేస్ సెంటర్‌లోని సైంటిస్ట్‌లతో కాసేపు ముచ్చటించనున్నారు పవన్. అనంతరం నెల్లూరులోని జనసేనలతో కాసేపు ముచ్చటించనున్నారు. ఆ తరువాత నేరుగా తన క్యాంపు ఆఫీస్‌కి చేరుకోనున్నారు.