UPDATES  

NEWS

 పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు..!

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే ఒక సందిగ్ధత కొనసాగింది. దీని పైన పవన్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు సూచన మేరకు పవన్ భవిష్యత్ బాధ్యతల పైన ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో..కొత్త ప్రభుత్వంలో పవన్ పాత్ర స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలే ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు.

 

మంత్రివర్గంలోకి పవన్ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కీలక బాధ్యతలకు సిద్దమయ్యారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండటంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశం పైన పవన్ కొద్ది రోజులుగా డైలమాలో ఉన్నారు. అయితే, ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. తాజాగా, ఒక జాతీయ మీడియాతో పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు. ఇదే అంశం పైన చంద్రబాబు – పవన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. జనసేన నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి.. ఏ శాఖలు ఇవ్వాలనే దాని పైన ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.

 

పవన్ శాఖల ఖరారు పవన్ కల్యాణ్ చంద్రబాబుతో పాటుగానే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయమైనట్లు సమాచారం. ఇక..పవన్ కల్యాణ్ కు కీలక శాఖలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా గత అయిదేళ్ల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని చంద్రబాబు, పవన్ ప్రతీ సభలోనూ చెబుతూ వచ్చారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు, పంచాయితీలకు అధికారాలు,..నిధులు ఇవ్వకపోవటం పైన పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో..ఏపీలో కీలకమైన ఈ అంశాల పైన పవన్ తానే ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే అంశం పైన చంద్రబాబుతో నూ చర్చలు జరిగినట్లు సమాచారం.

 

కేబినెట్ తుది కూర్పు దీంతో..పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరటం ఖాయమైంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు హోం – గ్రామీణాభివృద్ధి శాఖలు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవటంతో ఏపీలో జనసేనకు 4-5 శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. చంద్రబాబు జనసేనకు 3-4, బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్దమయ్యారని సమాచారం. దీంతో, ఈ రోజు..రేపు పవన్..బీజేపీ నేతలతో చంద్రబాబు కేబినెట్ కూర్పు పైన తుది కసరత్తు చేయనున్నారు. ఇందులో మంత్రుల పేర్లు..శాఖలు ఖరారు కానున్నాయి. తొలి సారిగా అసెంబ్లీలో అడుగు పెడుతూనే..పవన్ తీసుకొనే కొత్త బాధ్యతల నిర్వహణ పైన ఆసక్తి కనిపిస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |