ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార సమయం విషయంలో ఏపీ సీఎంఓ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పొరపాటు జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ నెల 12న ఉదయం 9.27 గంటలకు చంద్రబాబు ప్రమాణం చేస్తారని తొలుత ట్వీట్ చేశారు. కానీ, కాసేపటికి ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 12న ఉదయం 11.27 గంటలకే ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని పేర్కొంటూ మరో ట్వీట్ చేశారు. అటు టీడీపీ పార్టీ వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సమయం మారిదంటూ వచ్చిన సమాచారం అవాస్తవం అని పేర్కొన్నాయి. 12న ఉదయం 11.27 గంటలకే బాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు నిర్ధారించాయి.
Post Views: 45