UPDATES  

NEWS

 కౌంటింగ్ వేళ ఎన్నికల సీఈఓ హెచ్చరిక..!

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్దం అవుతోంది. ఏపీలో జరిగిన హోరా హోరీ పోరు తరువాత జరిగిన పోలింగ్ పైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో..కౌంటింగ్ వేళ ప్రత్యర్ధి పార్టీల ఎత్తుల పైన వైసీపీ ముఖ్య నేత సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో..తాజాగా ఎన్నికల సీఈవో మీనా కౌంటింగ్ వేళ అధికారులకు మార్గనిర్దేశం చేసారు. అలజడికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

జైలుకు పంపుతాం కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను ఆయన పరిశీలించారు.అభ్యర్థి, ఏజెంట్‌లలో ఎవరైనా కౌంటింగ్ సెంటర్లో గొడవ చేయాలని, అడ్డుకోవాలని చూస్తే వారిని వెంటనే అక్కడి నుంచి బయటకు పంపిస్తామనివార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ ఏరియా చుట్టూ ఎలాంటి ఊరేగింపులు చేయడానికి వీలులేదని తేల్చిచెప్పారు. ఆరోజు మధ్యం షాపులు కూడా పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

 

మూడంచెల వ్యవస్థ కౌంటింగ్ సెంటర్ల భద్రత కోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు సీఈఓ ఎంకే మీనా తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడిటీ అనుమానాలపై మరోసారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో క్లారిఫికేషన్ ఇప్పటికే ఇచ్చామని చెప్పారు. సీఈఓ ఆఫీసు, ఎన్నికల సంఘం వేర్వేరు కాదని స్సష్టం చేశారు. ఈ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలోని అనుమానాలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం పంపించింది. సీఈఓ ఇచ్చిన మెమోను ఈసీ సమర్ధించింది. కేవలం గెజిటెడ్ అధికారి సిగ్నేచర్ ఉంటే చాలని స్పష్టం చేసింది.

 

భారీ భద్రత ఇదే అంశం పైన వైసీపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. సీఈవో ఇచ్చిన మెమో ఉప సంహరించుకున్నట్లు కోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం నివేదించింది. కౌంటింగ్‌ రోజున అన్ని కౌంటింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ ఉంటుందని తెలిపారు. ఏజెంట్లు ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే బయటకు పంపించి వేస్తామని పేర్కొన్నారు. ఫలితాల తరువాత ఊరేగింపులు నిషేదం విధించామని తెలిపారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు , గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని చెప్పారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |