UPDATES  

NEWS

 గౌరవ డాక్టరేట్ ను అందుకున్న రామ్ చరణ్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. చిన్న వయస్సులోనే గౌరవ డాక్టరేట్ ను అందుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే చెన్నై వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు డాక్టరేట్ ను అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. చలన చిత్ర రంగంలో చరణ్ చేస్తున్న కృషికి వేల్స్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ను అందివ్వనున్నట్లు తెలిపింది. ఇక నేడు ఈ గౌరవాన్ని అందుకోవడానికి చరణ్.. తన సతీమణి ఉపాసనతో కలిసి చెన్నై చేరుకున్నాడు.

 

తాజాగా చరణ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యాడు. అందులో చరణ్.. వేల్స్ యూనివర్సిటీ అకాడమిక్ డ్రెస్ లో స్టేజిమీద కూర్చున్నాడు. అనంతరం యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోలను వేల్స్ యూనివర్సిటీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాకుండా RC17 లో నటిస్తున్నాడు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |