UPDATES  

NEWS

 ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు తిరిగిందా..?

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు తిరిగిందా? ఈ కేసులో పెద్ద తలకాయలు బయటపడుతున్నాయా? సిట్ తవ్విక కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? ఈ కేసు జగన్ ఫ్యామిలీ మెడకు చుట్టుకుందా? భారతి దగ్గర బంధువు నర్రెడ్డి సునీల్‌రెడ్డి? దాదాపు ఎనిమిదేళ్లు సునీల్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈ వ్యవహారంపై ఫ్యామిలీలో చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు చివరి దశకు చేరుకుంటోంది. రేపో మాపో తాడేపల్లి ప్యాలెస్‌కు నోటీసులు ఇవ్వడం ఖాయమని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో నర్రెడ్డి సునీల్‌రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో గురువారం 8 గంటలుపైగానే సిట్ సోదాలు చేయడంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. ఉన్నట్లుండి ఆయన ఎందుకొచ్చారు? ఆయన పేరు ఎలా వచ్చిందంటూ చర్చించుకోవడం మొదలైంది.

 

గతంలో ఎమ్మార్ కుంభకోణంలో సునీల్‌రెడ్డి ఏడో నెంబర్ నిందితుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన్ని అందరూ మరిచిపోయారు. కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. చివరకు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనిపించలేదు. తాజాగా లిక్కర్ కేసులో ఆయన పేరు వెలుగులోకి రావడం, ఆయన షెల్ కంపెనీలు ఒక్కసారిగా సోదాలు చేయడంతో హాట్ టాపిక్‌గా ఆయన మారాడు.

 

లిక్కర్ కేసు విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. సునీల్‌రెడ్డి విషయానికి వద్దాం. నర్రెడ్డి సునీల్‌రెడ్డి తండ్రి సంగిరెడ్డి సొంతూరు కడప జిల్లా. వీరపునాయునిపల్లె మండలం అనిమెల గ్రామానికి చెందినవాడు. జియాలజిస్ట్‌గా పనిచేసిన సంగిరెడ్డి ఆ తర్వాత పులివెందులలో సెటిలయ్యాడు. జగన్‌ భార్య భారతికి దగ్గర బంధువు కూడా. వైఎస్‌ ఫ్యామిలీతో సంగిరెడ్డి అనేక వ్యాపారాలు చేశారట.

 

ఈ క్రమంలో సునీల్‌రెడ్డి జగన్‌ ఇంట్లో కీలక వ్యక్తిగా మారాడు. మాజీ సీఎం ఆర్థిక, వ్యక్తిగత వ్యవహారాలను చూసేవాడని పులివెందుల ప్రజల మాట. మారిన పరిస్థితుల నేపథ్యంలో సంగిరెడ్డి ఫ్యామిలీకి అనేక కష్టాలు చుట్టుముట్టాయి. ఆయన చేసిన వ్యాపారాలన్నీ దివాలా తీశాయి. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పులివెందులలో ఆయన కీలకంగా మారిపోయాడు.

 

తొలుత ఇంటీరియర్‌ డెకరేషన్‌ వ్యాపారం చేసేవాడు సునీల్‌రెడ్డి. ఎమ్మార్ కుంభకోణంలో ఆయన పేరు బయటకు రావడం, సీబీఐ అరెస్ట్ చేయడం జరిగిపోయింది. ఆ తర్వాత కోట్లలో ఆస్తులు సంపాదించినట్టు పులివెందుల వాసుల మాట.

 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్‌రెడ్డి ఎక్కడా కనిపించలేదు. కాకపోతే తెర వెనక వ్యవహారాలను చక్కబెట్టేవాడని అంటున్నారు. అన్నట్లు వైసీపీ నేతలకు ఆయన పార్టీ ఆఫీసులో కనిపించిన సందర్భం లేదని అంటున్నారు. అప్పుడప్పుడు పులివెందుల వాసులకు మాత్రమే కనిపించేవాడని అంటున్నారు.

 

2019-23 మధ్యకాలంలో 11 షెల్ కంపెనీలు పెట్టాడట సునీల్‌రెడ్డి. అందులో మూడు హైదరాబాద్, రెండు విశాఖలో ప్రారంభించాడు. లిక్కర్ కేసులో ముడుపులను ఆ కంపెనీల నుంచి దుబాయ్‌‌కి వెళ్లినట్టు సిట్ గుర్తించింది. ఆ కంపెనీ అకౌంట్ల ద్వారా వందల కోట్లు ఫారెన్ దేశాలకు ట్రాన్స్‌ఫర్ అయినట్టు గుర్తించారట.

 

లిక్కర్ కేసు వ్యవహారంపై లోక్‌సభలో మాట్లాడిన టీడీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులు, హైదరాబాద్‌‌లోని కొన్ని కంపెనీల నుంచి రెండువేల కోట్లు దుబాయ్‌కి, వెయ్యి కోట్లు ఆఫ్రికాకు వెళ్లినట్టు ఇటీవల ఆయన వివరించిన విషయం తెల్సిందే.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |